Avocado: కొవ్వును వెన్నలా కరిగించే బట్టర్ ఫ్రూట్..!
కొవ్వును వెన్నలాగా కరిగించే బట్టర్ ఫ్రూట్ అంటే అవకాడో. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. దీనిని తీసుకోవడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి.
Avocado: కొవ్వును వెన్నలా కరిగించే బట్టర్ ఫ్రూట్..!
కొవ్వును వెన్నలాగా కరిగించే బట్టర్ ఫ్రూట్ అంటే అవకాడో. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. దీనిని తీసుకోవడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి. గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను ఇది తగ్గిస్తుంది.
అవకాడోలో విటమిన్ E, కెరోటెనాయిడ్స్ పుష్కలంగా ఉండటంతో కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చర్మానికి బంగారంలా మెరుపును ఇస్తుంది. దీనిలో ఉండే మోనో అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు గుండెకు మంచివిగా పనిచేస్తాయి.
విటమిన్ K, C, B5, B6, E వంటి విటమిన్లు ఇందులో సమృద్ధిగా ఉండడం వల్ల ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. పొటాషియం పుష్కలంగా ఉండటంతో రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
అవకాడోలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమ ఆహారం. దీనిని రోజూ డైట్‌లో చేర్చడం వల్ల డయాబెటిస్ వంటి జీవనశైలి సంబంధిత వ్యాధులు కూడా నియంత్రణలో ఉంటాయి.
అవకాడో ధర కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూసిన తర్వాత తప్పకుండా దీన్ని ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.