Nonstick Bowls: నాన్‌స్టిక్‌ గిన్నెలు వాడుతున్నారా.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..!

Nonstick Bowls: నేటి కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్‌ స్టవ్‌ ఉంటుంది లేదంటే ఎలక్ట్రిక్‌ స్టవ్‌ ఉంటుది.

Update: 2024-03-20 10:30 GMT

Nonstick Bowls: నాన్‌స్టిక్‌ గిన్నెలు వాడుతున్నారా.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..!

Nonstick Bowls: నేటి కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్‌ స్టవ్‌ ఉంటుంది లేదంటే ఎలక్ట్రిక్‌ స్టవ్‌ ఉంటుది. వీటిపై వంట చేయడానికి అనువైన గిన్నెలు మార్కెట్‌లో లభిస్తున్నాయి. వాటిలో ఒకటి నాన్‌స్టిక్‌ గిన్నెలు. వీటిలో వంట చేయడం చాలా సులువు. ఇందులో ఏం వండినా అడుగంటదు. అందుకే చాలామంది మహిళలు వీటిని ఎక్కువగా వాడుతున్నారు. అయితే వీటిని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే తొందరగా పాడవుతాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

నాన్‌స్టిక్ పాత్రల్లో వంట చేసేటప్పుడు సన్నటి మంటపై మాత్రమే ఉంచాలి. పెద్ద మంట పెడితే ఆ వేడికి నాన్‌స్టిక్ పాత్రలపై ఉన్న టెప్లాన్ కోటింగ్ పోతుంది. నాన్‌స్టిక్ పాత్రలను డైరెక్ట్‌ స్టవ్‌పై పెట్టి అలాగే ఉంచొద్దు. పెట్టే ముందు లేదా పెట్టిన వెంటనే కొద్దిగా నూనె పోయాలి. ప్రతి వంటకానికి నాన్‌స్టిక్‌ పాత్రలను ఉపయోగించకూడదు. ఏవైనా అతుక్కుపోయే కూర‌లు లేదా ఫ్రై క‌ర్రీలు చేసినప్పుడే మాత్రమే వీటిని వాడాలి. తద్వారా ఎక్కువ కాలం వస్తాయి.మకూర వండేట‌ప్పుడు క‌ల‌ప‌డానికి ప్లాస్టిక్‌, చెక్క గ‌రిటెల‌ను మాత్రమే ఉపయోగించాలి. ఐరన్‌, స్టీల్‌, ఇత్తడి, సిల్వర్‌ వంటి గరిటెలను వాడకూడదు. వీటిని వాడితే గిన్నెపై గీతలు పడే అవకాశం ఉంటుంది.

నాన్‌స్టిక్ పాత్రలను తోమేటప్పుడు గ‌రుకుగా ఉండే పీచు ఉప‌యోగించ‌వ‌ద్దు. జిడ్డు మ‌రక‌లు పోవాల‌ని గ‌ట్టిగా రుద్దకూడదు. దీనివ‌ల్ల గిన్నెల‌పై కోటింగ్ పోయే అవ‌కాశం ఉంటుంది. గిన్నెల‌కు అంటుకున్న ప‌దార్థాలు పోవాల‌ని చెంచా, చాకుల‌తో గీక‌కూడ‌దు. అలా చేస్తే గిన్నెల‌పై గీత‌లు ప‌డి తొంద‌ర‌గా పాడ‌వుతాయి. గిన్నెలో నీళ్లు పోసి చాలాసేపు నాన‌నివ్వాలి. ఆ త‌ర్వాత రుద్ది క‌డిగితే సులువుగా శుభ్రమ‌వుతాయి. నాన్‌స్టిక్ పాత్రలను వంటింట్లోని సెల్ఫ్‌లు లేదా అల్మారాలో పెట్టిన‌ప్పుడు గీత‌లు ప‌డే ప్రమాదం ఉంది. అందుకే వాటిని సెల్ఫ్‌లో కాకుండా, గిన్నెలు పెట్టుకునే స్టాండ్‌లో పెట్టడమే మంచిది.

Tags:    

Similar News