జలుబు, ఫ్లూ కోసం ఇంట్లోనే మందులు వేసుకుంటున్నారా.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ తెలుసుకోండి..!

Health News: శీతాకాలంలో చాలా మంది జలుబు-దగ్గు, ఫ్లూ సమస్యలను ఎదుర్కొంటారు.

Update: 2023-01-22 08:30 GMT

జలుబు, ఫ్లూ కోసం ఇంట్లోనే మందులు వేసుకుంటున్నారా.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ తెలుసుకోండి..!

Health News: శీతాకాలంలో చాలా మంది జలుబు-దగ్గు, ఫ్లూ సమస్యలను ఎదుర్కొంటారు. ఆస్పత్రుల్లోని ఓపీకి ఎక్కువ మంది ఈ సమస్యలతోనే వస్తారు. మరికొంతమంది స్వయంగా ఇంట్లోనే మందులు తీసుకుంటారు. ఇటీవల యాంటీబయాటిక్స్ వాడకం చాలా పెరుగుతోంది. ఈ సాధారణ సమస్యలకు తీసుకునే మందులు ఆరోగ్యానికి ఎంత హాని చేస్తున్నాయో ఈరోజు తెలుసుకుందాం.

యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. ఎటువంటి ఔషధాలు పనిచేయవు. వైరల్ ఫ్లూ రోగుల్లో 60 నుంచి 70 శాతం మంది వైద్యులను సంప్రదించకుండా సొంతంగా మందులు తీసుకుంటున్నట్లు ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవడం వల్ల ఇతర వ్యాధులకు సరైన చికిత్స సాధ్యం కాదు. యాంటీబయాటిక్స్ అధికంగా వాడటం వల్ల రెసిస్టెన్స్ సమస్య వేగంగా పెరుగుతోంది.

చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఈ సమస్య ఎక్కువగానే కనిపిస్తోంది. జలుబు సమస్యలో ప్రజలు యాంటీబయాటిక్స్ తీసుకోవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల శరీరంపై అనేక దుష్ప్రభావాలు ఉంటాయి. వీటి అధిక వినియోగం కాలేయం, మూత్రపిండాల వ్యాధికి కారణమవుతుంది. కానీ వీటి దుష్ప్రభావాలు చాలా ఆలస్యంగా తెలుస్తాయి. మందులు పిల్లలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి వారికి అలెర్జీ సమస్యలు వస్తాయి.

దగ్గు-జలుబు, గొంతునొప్పి వంటి సాధారణ సమస్యలలో ప్రజలు యాంటీబయాటిక్స్ తీసుకోవద్దు. ఈ సమస్యలు కొన్ని రోజులకి వాటంతట అవే నయమవుతాయి. ఔషధం తీసుకోవడం వారిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపదు కానీ ఖచ్చితంగా శరీరానికి హాని కలిగిస్తుంది. యాంటీబయాటిక్స్ అధికంగా వాడటం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది.

Tags:    

Similar News