Women Health: ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారా.. ఇలా సులువుగా తొలగించండి..!

Women Health: పుట్టుకతో శరీరంపై ఏర్పడే కొన్ని గుర్తులను ఎప్పటికీ తొలగించలేం. వీటివల్ల చాలామంది బాధపడుతుంటారు.

Update: 2024-01-03 16:00 GMT

Women Health: ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారా.. ఇలా సులువుగా తొలగించండి..!

Women Health: పుట్టుకతో శరీరంపై ఏర్పడే కొన్ని గుర్తులను ఎప్పటికీ తొలగించలేం. వీటివల్ల చాలామంది బాధపడుతుంటారు. అయితే మధ్యలో ఏర్పడే కొన్ని గుర్తులను సులువుగా తొలగించుకోవచ్చు. చాలాసార్లు మహిళలు డెలివరీ అయ్యాక స్ట్రెచ్ మార్క్స్ తో ఇబ్బందిపడుతుంటారు. వీటి కారణంగా ఇష్టమైన దుస్తులు ధరించలేకపోతారు. చీర కట్టుకున్నప్పుడు స్ట్రెచ్ మార్క్స్ స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే చాలామంది పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లలేకపోతారు.

స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించేందుకు మార్కెట్‌లోకి అనేక ఉత్పత్తులు వచ్చాయి. కానీ ఇవి అంత ప్రభావవంతంగా పనిచేయవు. అంతేకాకుండా వీటివల్ల చర్మ సమస్యలు ఎదురవుతాయి. దీని కారణంగా అలెర్జీకి గురవుతారు. ఇంట్లో లభించే కొన్ని వస్తువులను ఉపయోగించి స్ట్రెచ్ మార్క్స్ నుంచి బయటపడవచ్చు. అలాంటి కొన్ని హోం రెమిడీస్‌ నుంచి ఈరోజు తెలుసుకుందాం.

బాదం స్క్రబ్

స్ట్రెచ్ మార్క్స్ తొలగించుకోవడానికి ఒక గిన్నెలో బాదం పొడి, చక్కెర, కాఫీ, కొబ్బరి నూనె మిక్స్‌ చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని పేస్ట్ లా చేసుకుని ప్రతిరోజూ స్నానానికి ముందు స్ట్రెచ్ మార్క్స్ ఉన్నచోట అప్లై చేయాలి. కొద్ది రోజుల్లోనే తేడా తెలుస్తుంది.

బంగాళాదుంప రసం

బంగాళాదుంప రసం సహజ పద్ధతిలో మచ్చలను తొలగించడానికి ఉపయోగిస్తారు. నిజానికి బంగాళాదుంప బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. ఇది మచ్చలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక చెంచా బంగాళాదుంప రసంలో అలోవెరా జెల్ మిక్స్ చేసి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇలా రోజు అప్లై చేయడం వల్ల క్రమంగా తొలగిపోతాయి.

ఆముదంతో మసాజ్

స్ట్రెచ్ మార్క్స్ తొలగించుకోవడానికి ఆముదం నూనెను ఉపయోగించవచ్చు. ఇది చర్మం ఛాయను మెరుగుపరచడానికి పనిచేస్తుంది. ఆముదం నూనెను అప్లై చేసే ముందు కొద్దిగా వేడి చేయాలి. తర్వాత రాత్రి పడుకునే ముందు స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఆవనూనెకు బదులు ఆలివ్ నూనెను కూడా ఉపయోగించవచ్చు.

Tags:    

Similar News