Health Tips: రాత్రిపూట అతిగా తింటున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే కంట్రోల్‌లో ఉంటారు..!

Health Tips: ఈరోజుల్లో తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది విపరీతమైన బరువు పెరుగుతున్నారు.

Update: 2023-05-24 14:30 GMT

Health Tips: రాత్రిపూట అతిగా తింటున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే కంట్రోల్‌లో ఉంటారు..!

Health Tips: ఈరోజుల్లో తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది విపరీతమైన బరువు పెరుగుతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. కొంతమందికి రాత్రిపూట అతిగా తినే అలవాటు ఉంటుంది. దీని కారణంగా జీవక్రియ మందగిస్తుంది. ఈ పరిస్థితిలో బరువు వేగంగా పెరుగుతారు. అంతేకాకుండా అతిగా తినడం వల్ల బిపి, డయాబెటిస్‌కు సంబంధించిన సమస్యలు మొదలవుతాయి. అందువల్ల ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అతిగా తినడం మానుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట అతిగా తినడం ఎలా నివారించాలో ఈరోజు తెలుసుకుందాం.

బ్రేక్ ఫాస్ట్ స్కిప్‌ చేయవద్దు

శరీరానికి ఉదయం ఆహారం చాలా ముఖ్యం. ఈ పరిస్థితిలో మార్నింగ్ డైట్ మానేస్తే చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉదయం అల్పాహారం తినకపోతే తొందరగా అలసిపోతారు. అలాగే రాత్రిపూట అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారం తీసుకుంటారు. కాబట్టి అతిగా తినకుండా ఉండాలంటే ఉదయం టిఫిన్‌ అస్సలు మిస్‌ కావొద్దు.

తగినంత నీరు తాగాలి

లావుగా ఉండకూడదనుకుంటే రాత్రిపూట అతిగా తినకూడదు. ఇలాంటి సమయంలో నీరు ఎక్కువగా తాగాలి. దీనివల్ల పొట్ట నిండుగా ఉంటుంది. దీంతో అతిగా తినకుండా ఉంటారు. అలాగే సమయానికి భోజనం చేయాలి. రోజంతా తగినంత నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.

ఆహారం బాగా నమలాలి

రాత్రిపూట డైట్‌లో సమతుల్య ఆహారం చేర్చాలి. లైట్‌ ఫుడ్‌ మాత్రమే తీసుకోవాలి. అంతేకాదు ఆహారాన్ని బాగా నమిలి తినాలి. దీనివల్ల మీకు త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. కడుపు చాలా కాలం నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దీంతో సులువుగా బరువు తగ్గుతారు.

Tags:    

Similar News