మునగాకు మంచిదని అదేపనిగా తింటున్నారా? అయితే, ఈ వ్యాధుల ఉన్నవారు మునగాకు తింటే డేంజర్‌‌

మునగాకుతో శరీరానికి అంతా లాభమే. పుష్కలైమన పోషకాలు, విటమిన్లు ఉండే ఈ ఆకు బయటకొన్న ఆకుకూరల్లో కంటే ఎక్కువ విటమిన్లు ఉంటాయి. కాల్షియం, ఐరెన్ లెవెల్స్ తక్కువగా ఉన్నవాళ్లు మొదటిగా తినాల్సిన ఆకుకూర కడా ఇదే.

Update: 2025-06-21 11:39 GMT

మునగాకుతో శరీరానికి అంతా లాభమే. పుష్కలైమన పోషకాలు, విటమిన్లు ఉండే ఈ ఆకు బయటకొన్న ఆకుకూరల్లో కంటే ఎక్కువ విటమిన్లు ఉంటాయి. కాల్షియం, ఐరెన్ లెవెల్స్ తక్కువగా ఉన్నవాళ్లు మొదటిగా తినాల్సిన ఆకుకూర కడా ఇదే. ఇన్ని లాభాలున్న మునగాకుని కొన్ని వ్యాధులున్నవారు మాత్రం తీసుకోకూడదు. ఆ వ్యాధులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మునగాకు.. ఆయుర్వేదం మందులలో ఎక్కువగా వాడతారు. కొన్ని వందల జబ్బులను నయం చేసే గుణం మునగాకులో ఉంటుంది. వారానికి ఒక్కసారైనా ఈ ఆకుని తినాలని డాక్టర్లు చెబుతుంటారు. పిల్లలకు, పెద్దవాళ్లకు ఈ ఆకు వల్ల ఎంతో లాభం కలుగుతుంది. మునగాకులో విటమిన్లు, ఎమినో యాసిడ్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా విటమిన్ ఎ కోసం క్యారెట్లు తింటాం. కానీ క్యారెట్లు కంటే పది రెట్లు ఎక్కువగా మునగాకు ద్వారా విటమిన్ ఎ పొందవచ్చు.

అంతేకాదు, పాల నుంచి లభించే కాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు నుండి లభిస్తుంది. ఇక ప్రోటీన్ల విషయానికొస్తే పెరుగు నుంచి వచ్చే ప్రోటీన్లను 8 రెట్లు అధికంగా మునగాకు ఇస్తుంది. అదేవిధంగా అరటపండ్ల కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం ఈ మునగాకులో దొరుకుతుంది. ఇవేకాదు కాల్షియం, ఐరన్ ఇందులో పుష్కలంగా ఉంటాయి.

అసలు ఒక వంద గ్రాముల మునగాకు మీరు గనక తింటే ఎన్ని పోషక పదార్దాలు మీ శరీరానికి అందుతాయో మీకు తెలుసా? మునగాకులో నీరు 75.9శాతం ఉంటే మినరల్స్ 2.3 శాతం ఉంటుంది. దీనితోపాటు, పిండి పదార్దాలు 13.4 గ్రా, ఫ్యాట్స్ 17 గ్రా, మాంసకృత్తులు 6.7 గ్రా, పాస్పరస్ 70 మి.గ్రా, ఐరన్ 7 మి. గ్రా, కాల్షియం 440 మి.గ్రా, విటమిన్ సి 200 మి.గ్రా, పీచు పదార్ధాలు 0.9 మి.గ్రాతో పాటు శక్తి 97 క్యాలరీలు ఉంటాయి.

కానీ, ఇన్ని లాభాలున్న మునగాకుని కొన్ని జబ్బులు ఉన్నవారు మాత్రం తినకూడదు. ఆయుర్వేద ప్రకారం మునగ ఆకులను కాలేయ సంబంధిత వ్యాధులున్నవారు తీసుకోకూడదు. అలాగే.. గుండె జబ్బులు, షుగర్ పేషెంట్లు, నెలల నిండిన గర్భిణీలు కూడా తీసుకోకపోవడమే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.

షుగర్ పేషెంట్లు మునగాకును ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా తగ్గిపోతాయి. దీంతో హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది. అలాగే మునగలో శరీరం ఇన్సులెన్ సెన్సిటివిటీని పెంచే గుణాలున్నాయి. వీటి మెడిసిన్ తీసుకునేవారు మునగాకుని తినకుండా ఉంటేనే మంచిది.

గుండె సంబంధిత మరియు హైబీపీ ఉన్నవాళ్లు వీటికి సంబంధించిన మందులు వాడుతున్నవాళ్లు కూడా మునగాకిని రెగ్యులర్ గా తీసుకోకూడదు. ఈ వ్యాధులున్న మునగాకుని ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు చాలా తగ్గిపోతుంది. దీనివల్ల అకస్మాత్తుగా నీరసం అవ్వడం, తలనొప్పి, తన తిరగడం వంటివి జరుగుతాయి.

ఇక కాలేయ సంబంధిత వ్యాధులున్న రోగులు కూడా మునగాకు తినకూడదు. ఇప్పటికే వాళ్లు కాలేయానికి సంబంధించి మందులు వాడతారు. వీటి ప్రభావం కాలేయంపై ప్రభావం పడుతుంది. అలాగే మునగాకు కూడా కాలేయపై ప్రభావం చూపిస్తుంది. ఒకేసారి ఇవి కాలేయంపై ప్రభావం చూపించడం వల్ల కాలేయానికి పెద్ద ప్రమాదం ఉంటుంది.

ఏదిఏమైనా కూడా ఎవరికి ఎలాంటి జబ్బులున్నా వారి డాక్టర్లను సంప్రదించి మునగాకుని తింటే బెటర్ అని డాక్టర్లు చెబుతున్నారు. 

Tags:    

Similar News