Ice Apples: వేసవిలో తాటిముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..!

Ice Apples: ఎండాకాలం వచ్చిందంటే గ్రామాల్లో సందడి నెలకొంటుంది. ఈ సీజన్‌లో వచ్చే మామిడి, సపోటా, ఈతకాయలు, తాటి ముంజలు ఎంతో రుచిగా ఉంటాయి.

Update: 2024-03-26 11:01 GMT

Ice Apples: వేసవిలో తాటిముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..!

Ice Apples: ఎండాకాలం వచ్చిందంటే గ్రామాల్లో సందడి నెలకొంటుంది. ఈ సీజన్‌లో వచ్చే మామిడి, సపోటా, ఈతకాయలు, తాటి ముంజలు ఎంతో రుచిగా ఉంటాయి. ముఖ్యంగా ఎండాకాలం లభించే తాటి ముంజలను చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ తింటారు. ప్రకృతి నుంచి వస్తాయి కాబట్టి కల్తీ లేనివి, స్వచ్చమైనవిగా చెబుతుంటారు. తాటి ముంజలు శరీరానికి పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

తాటి ముంజల్లో విటమిన్స్ ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం, థయామిన్, రోబో ప్లేవిస్, నియాసిస్, బీ కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. అలాగే తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల వడదెబ్బ తగలకుండా శరీరాన్ని చల్లబరుస్తాయి. డీహైడ్రేషన్‌కు గురికాకుండా చేస్తాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచడంతో పాటుగా గుండె ఆరోగ్యానికి సాయపడుతాయి. తాటి ముంజలు ప్రతి రోజు తినడం వల్ల లివర్‌కు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలస్ట్రాల్‌ వృద్ధి చెందుతుంది.

తాటి ముంజలను తీసుకోవడం వల్ల గ్యాస్ ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను తగ్గించడంలో తాటి ముంజలు కీలక పాత్ర పోషిస్తాయి. అధిక బరువును తగ్గించి నాజుకుగా మారేలా చేస్తాయి. ముంజల వల్ల ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. వాటిని గుజ్జుగా చేసి ముఖానికి రాసుకుంటే చెమటకాయలను తగ్గించడంతో పాటు చర్మాన్ని కాపాడుతాయి.100 గ్రాముల ముంజల్లో 43 క్యాలరీల ఫైబర్‌ ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తరిమికొడతాయి.

Tags:    

Similar News