Cool Drink Side Effects: కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా.. నిపుణులు చెబుతున్న నిజాలు తెలుసుకోండి..!
Cool Drink Side Effects: ఈ రోజుల్లో కూల్‌డ్రింక్స్ తాగడం ఒక స్టేటస్‌గా భావిస్తున్నారు. నలుగురు ఒక్కచోట కలిస్తే కూల్‌డ్రింక్స్ తాగేస్తున్నారు.
Cool Drink Side Effects: కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా.. నిపుణులు చెబుతున్న నిజాలు తెలుసుకోండి..!
Cool Drink Side Effects: ఈ రోజుల్లో కూల్‌డ్రింక్స్ తాగడం ఒక స్టేటస్‌గా భావిస్తున్నారు. నలుగురు ఒక్కచోట కలిస్తే కూల్‌డ్రింక్స్ తాగేస్తున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, శుభకార్యాలలో ఫుడ్ ఐటమ్‌గా సర్వ్ చేస్తున్నారు. చివరకు వీటిని ఇంటికి తెచ్చుకొని ఫ్రిజ్‌లలో స్టోర్ చేసుకొని తాగుతున్నారు. రుచిగా ఉండే శీతల పానీయాలు అందరికి ఇష్టమే. కానీ ఈ అలవాటు చాలా హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం.
జీర్ణక్రియపై ప్రభావం
కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఇది శరీరాన్ని అధికంగా చల్లగా చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కడుపు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
కడుపులో గ్యాస్
కూల్‌డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది అజీర్ణం, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు ఏర్పడుతాయి. కాబట్టి వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండటం మంచిది.
గుండె ఆరోగ్యంపై ప్రభావం
కూల్‌డ్రింక్స్‌లో అధిక మొత్తంలో చక్కెర, కెఫిన్ ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి రక్తపోటును పెంచుతాయి. గుండె జబ్బులకు కారణమవుతాయి.
బరువు పెరిగే ప్రమాదం
కూల్‌డ్రింక్స్‌లో అధిక మొత్తంలో చక్కెర, కేలరీలు ఉంటాయి. ఇవి బరువును పెంచుతాయి. దీని కారణంగా బరువు అదుపులో ఉండదు. పెరుగుతున్న బరువుతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
మితిమీరిన కెఫిన్
కొన్ని కూల్‌డ్రింక్స్‌లో అధిక మొత్తంలో కెఫిన్ ఉంటుంది, ఇది మీ నరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది.
బ్లడ్ షుగర్ లెవెల్
మీరు అతిగా కూల్‌డ్రింక్స్ తాగితే రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరుగుతుంది. డయాబెటిక్ పేషెంట్లకు ఇది విషం కంటే తక్కువేమీ కాదు.