Anemia: నిత్యం ఈ సమస్యలు వేధిస్తున్నాయా? అయితే రక్తహీనత సంకేతాలే!
రక్తహీనత అంటే శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య లేదా వాటిలోని హిమోగ్లోబిన్ స్థాయి సాధారణం కంటే తక్కువగా ఉండే పరిస్థితి. హిమోగ్లోబిన్ అనేది శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను తరలించే ముఖ్యమైన ప్రోటీన్. ఇది తగ్గిపోతే శరీర కణాలకు తగినంత ఆక్సిజన్ అందక, పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి.

రక్తహీనత ప్రధాన లక్షణాలు:
1. అలసట, బలహీనత – శరీరానికి తగిన ఆక్సిజన్ అందక కండరాలు, అవయవాలు శక్తిని కోల్పోతాయి. ఫలితంగా చిన్న పనులు చేయడానికే బలహీనత, రోజంతా అలసటగా అనిపించడం జరుగుతుంది.
2. చర్మం పాలిపోయినట్లు కనిపించడం – హిమోగ్లోబిన్ తగ్గితే చర్మం సహజ రంగు కోల్పోతుంది. కనురెప్పల లోపలి భాగం, పెదవులు, గోళ్ల కింద భాగం తెల్లగా కనిపించడం దీని సూచన.
3. శ్వాస ఆడకపోవడం, గుండె వేగం పెరగడం – ఆక్సిజన్ లోపం పూడ్చుకోవడానికి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. మెట్లు ఎక్కడం, కొంచెం నడవడం వంటి పనులకే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు.
4. తల తిరగడం, తలనొప్పి – మెదడుకు తగిన ఆక్సిజన్ అందక తల తిరుగడం, కళ్లు బైర్లు కమ్మడం, తరచుగా తలనొప్పి రావడం జరుగుతుంది.
5. చేతులు, కాళ్లు చల్లగా ఉండటం, చిరాకు – రక్త ప్రసరణ సరిగా లేక చేతులు, కాళ్లు చల్లగా మారిపోవడం, తక్కువ హిమోగ్లోబిన్ వల్ల మానసిక స్థితిలో మార్పులు రావడం జరుగుతుంది.
రక్తహీనతకు కారణాలు:
పోషకాహార లోపం – ఐరన్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ లోపం.
రక్తస్రావం – గాయాలు, పీరియడ్స్‌లో అధిక రక్తస్రావం, అంతర్గత రక్తస్రావం.
దీర్ఘకాలిక వ్యాధులు – కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పోషకాహారం – పాలకూర, తోటకూర, బెల్లం, ఎండు ఖర్జూరం, దానిమ్మ, గుడ్లు, మాంసం.
విటమిన్ C – నిమ్మకాయ, నారింజ, ఉసిరి వంటి ఆహారాలు ఐరన్ శోషణకు సహాయం చేస్తాయి.
డాక్టర్‌ని సంప్రదించడం – పై లక్షణాలు ఉంటే వెంటనే రక్తపరీక్షలు చేయించుకోవాలి.