Health: చక్కెర తీసుకోవడం మానేస్తే ఏమవుతుందో తెలుసా.?
30-Day No Sugar Challenge: చక్కెర... ఇది లేకుండా చాలామందికి రోజు మొదలవదు. ఉదయం టీ, కాఫీ నుంచి రాత్రి పాల వరకు చక్కెరను తినటం నిత్యజీవితంలో ఒక భాగంగా మారింది.
Health: చక్కెర తీసుకోవడం మానేస్తే ఏమవుతుందో తెలుసా.?
30-Day No Sugar Challenge: చక్కెర... ఇది లేకుండా చాలామందికి రోజు మొదలవదు. ఉదయం టీ, కాఫీ నుంచి రాత్రి పాల వరకు చక్కెరను తినటం నిత్యజీవితంలో ఒక భాగంగా మారింది. అయితే దీన్ని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చక్కెర తీసుకోవడం మానేస్తే, శరీరంలో పాజిటివ్ మార్పులు ప్రారంభమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కనీసం నెల రోజుల పాటు కఠినంగా చక్కెర లేకుండా జీవనశైలి కొనసాగించగలిగితే... ఆరోగ్యంలో నమ్మలేనంత మెరుగులు కనిపిస్తాయని వారు అంటున్నారు. అయితే చక్కెర మానేయడం మొదట్లో కొంత కష్టంగా అనిపించొచ్చు.
ప్రారంభంలో ఎదురయ్యే లక్షణాలు:
చక్కెర తీసుకోవడం మానేసిన తర్వాత మొదటి వారంలోనే కొన్ని మానసిక, శారీరక మార్పులు కనిపించవచ్చు:
* తీపి తినాలనే వాంఛ ఎక్కువగా ఉంటుంది
* తలనొప్పి, అలసట
* మానసిక ఆందోళన, చిరాకు
* నిద్రలేమి, ఏకాగ్రత లోపం
ఇవి తాత్కాలికం మాత్రమే. కొన్ని రోజులు సబురుగా సహించగలిగితే శరీరానికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
నెల రోజుల్లో కనిపించే ఫలితాలు:
* శరీరంలోని కొవ్వు తగ్గుతుంది, బరువు తగ్గుతుంది
* శక్తి స్థాయిలు పెరుగుతాయి, రోజంతా చురుకుగా అనిపిస్తుంది
* చర్మం ప్రకాశిస్తుంది, వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి
* మెమొరీ, ఏకాగ్రత మెరుగవుతుంది
* డయాబెటిస్ కంట్రోల్ లోకి వస్తుంది
* గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది
* దంత ఆరోగ్యం మెరుగవుతుంది
* లివర్‌లోని కొవ్వు తగ్గి, శరీరం పోషకాలు బాగా గ్రహిస్తుంది
ఈ మార్పులన్నీ నెలరోజుల్లోనే స్పష్టంగా కనిపిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆరోగ్యంగా జీవించాలనుకునేవారు చక్కెర తీసుకోవడం పైన గమనించాల్సిన సమయం ఇది.