Pumpkin Leaves Benefits: ఈ ఆకులు అమృతం కంటే ఎక్కువ..ఆడవారిలో వచ్చే ఆ సమస్యలకు సంజీవని

Update: 2025-02-06 07:53 GMT

Pumpkin Leaves Benefits: మీరు ఎప్పుడైనా గుమ్మడి ఆకులతో వంట చేశారా. గుమ్మడికాయ కూరవలే దాని ఆకులు కూడా ఎంతో రుచికరంగా ఉంటాయి. అందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.గుమ్మడి ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ సమ్మేళనాలు, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు కాల్షియం, మాంగనీస్, విటమిన్ బి6, భాస్వరం కూడా ఉన్నాయి. ఈ పోషకాలన్నీ శారీరక, మానసిక అభివ్రుద్ధిలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. గుమ్మడి ఆకులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

ఈ రోజుల్లో చాలా మంది మహిళలకు ప్రీమెన్స్టువల్ సిండ్రోమ్ ఒక ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ సమస్యతో బాధపడుతున్న ఆడవాళ్ల మానసిక స్థితిలో మార్పులు, తలనొప్పి, నిరాశ, చిరాకు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. దీని నుంచి ఉపశమనం పొందేందుకు మహిళలు మాంగనీస్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. గుమ్మడి ఆకుల్లో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఈ సమస్యలో మహిళలకు ఉపశమనం లభిస్తుంది.

మలబద్ధకంతో బాధపడుతున్న మహిళలకు గుమ్మడి ఆకులు మేలు చేస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే గుమ్మడికాయ ఆకులను తీసుకోవడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. గుమ్మడికాయ ఆకుల్లో కాల్షియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. ఇది మీ ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. దంతాల అభివ్రుద్దిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీటిని క్రమంగా తీసుకోవడం వల్ల కీళ్లు, ఎముకల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

గుమ్మడి ఆకుల్లో మంచి మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. బుుుతుక్రమ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు గుమ్మడి ఆకుల్లో ఉండే కరికే ఫైబర్ చిన్న ప్రేగుల నుంచి కొలెస్ట్రాల్, పిత్త ఆమ్లాల శోషణను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడం వల్ల ఫైబర్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News