Women Health: మహిళలకు అలర్ట్‌.. 40 నుంచి 55 ఏళ్ల మధ్య ఈ వ్యాధి బారినపడుతున్నారు..!

Women Health: ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో చనిపోయే మరణాల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. నిజానికి ఇందులో మహిళలు, పురుషులు ఉన్నారు.

Update: 2024-03-24 08:00 GMT

Women Health: మహిళలకు అలర్ట్‌.. 40 నుంచి 55 ఏళ్ల మధ్య ఈ వ్యాధి బారినపడుతున్నారు..!

Women Health: ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో చనిపోయే మరణాల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. నిజానికి ఇందులో మహిళలు, పురుషులు ఉన్నారు. మహిళల్లో మెనోపాజ్ తర్వాత గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది. మెనోపాజ్ అనేది స్త్రీకి పీరియడ్స్ రావడం ఆగిపోయే సమయం. ఇది సాధారణంగా 45 నుంచి 55 సంవత్సరాల మధ్య జరుగుతుంది. మెనోపాజ్ సమయంలో మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గుతుంది. ఈస్ట్రోజెన్ సిరలను ఫ్లెక్సిబుల్‌గా ఉంచడంలో వాపును తగ్గించడంలో సాయపడుతుంది. ఈస్ట్రోజెన్ తక్కువ స్థాయిల కారణంగా సిరలు గట్టిపడతాయి ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే ఇతర కారణాల గురించి కూడా తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ స్థాయి

మెనోపాజ్ తర్వాత చెడు (ఎల్‌డిఎల్) కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. మంచి (హెచ్‌డిఎల్) కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. ఇది సిరల్లో కొవ్వు పేరుకుపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది గుండె జబ్బులకు కారణమవుతుంది.

బ్లడ్ ప్రెజర్

మెనోపాజ్ తర్వాత రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. అధిక రక్తపోటు కారణంగా గుండె రక్తాన్ని పంప్ చేయడానికి చాలా కష్టపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

బరువు పెరగడం

మెనోపాజ్ తర్వాత బరువు పెరగడం సాధారణం. అధిక బరువు లేదా ఊబకాయం అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి గుండె జబ్బులకు కారణమవుతుంది. అలాగే వ్యాయామం లేకపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి మెనోపాజ్ తర్వాత మహిళలు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధూమపానం చేయకపోవడం, మద్యానికి దూరంగా ఉండడం చేయాలి.

Tags:    

Similar News