AC Overnight: రాత్రంతా ఏసీ వాడుతున్నారా? ఈ 5 ప్రమాదకరమైన అలవాట్లు మార్చుకోండి

AC Overnight Running Tips: ఎండాకాలం పగలు మాత్రమే కాదు రాత్రంతా కూడా ఏసీ వినియోగిస్తున్నారు. ఎండ విపరీతంగా పెరగడంతో ఇలా చేయాల్సి వస్తుంది.

Update: 2025-04-19 11:36 GMT

AC Overnight: రాత్రంతా ఏసీ వాడుతున్నారా? ఈ 5 ప్రమాదకరమైన అలవాట్లు మార్చుకోండి

AC Overnight Running Tips: ఏసీ రాత్రంతా వినియోగిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే చర్మ ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు కరెంటు బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది. ఎండాకాలం కాబట్టి రాత్రి సమయంలో కూడా ఏసీలు వినియోగిస్తున్నారు. ఎండలు బీభత్సం సృష్టించడంతో ఇలా జరుగుతుంది. అయితే రాత్రి సమయంలో కొన్ని పనులు మానుకోవాలి. తద్వారా ఏసీ రాత్రంతా ఆన్‌ చేసినా కానీ బిల్లు ఎక్కువగా రాదు. అంతేకాదు చర్మ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

రాత్రంతా ఏసీ ఆన్ చేసి పెడితే తక్కువ టెంపరేచర్ మాత్రమే పెట్టండి. 16 నుంచి 18 టెంపరేచర్ పెట్టడం మంచిది. మామూలు టెంపరేచర్ అంటే 24 వద్ద పెట్టాలి. ఇది మన శరీరానికి సరిపోతుంది. అంతే కాదు కరెంట్ బిల్లు కూడా తక్కువగా వస్తుంది. చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.

అంతేకాదు రాత్రి సమయంలో స్లీప్ మోడ్ టైమర్ సెట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. లేకపోతే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. రాత్రంతా నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయి. టెంపరేచర్ హఠాత్తుగా పెరగడంతో చలి వల్ల తరచూ నిద్ర లేవాల్సి వస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే టైమర్ సెట్ చేసుకోండి.

అంతేకాదు మీ బెడ్ ఎయిర్ ఫ్లోకు నేరుగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి. లేకపోతే ఏసీ ఆన్ చేయగానే చలి ఎక్కువ అయిపోతుంది. రూమ్ టెంపరేచర్ చల్లబడక ముందే ఏసీ ఆఫ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా తలనొప్పి, గొంతు నొప్పి సమస్యలు కూడా వస్తాయి. మీ బెడ్ ఏసికి నాలుగు ఫీట్ల దూరంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.

ఇది మాత్రమే కాదు ఎప్పటికప్పుడు తరచూ ఫిల్టర్లు క్లీన్ చేసుకోవాలి. తద్వారా అలర్జీలు రాకుండా ఉంటాయి. బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది .అలర్జీ, ఆస్తమా ఉన్నవాళ్లు ఇలా ఏసీలు క్లీన్ చేయకుండా ఉంటే ప్రమాదకరంగా మారుతుంది. ప్రతి మూడు వారాలకు ఒకసారి క్లీన్ చేయండి.

అంతేకాదు ఏసీ ఆన్ చేస్తే కిటికీలు, డోర్లు కచ్చితంగా మూసి ఉంచండి. లేకపోతే గాలి బయటకు వెళ్ళిపోతుంది. రూమ్ చల్లబడకుండా ఉంటుంది. కరెంట్ బిల్లు కూడా ఎక్కువ వస్తుంది. ఏసీ ఆన్ చేసినప్పుడు మీ ఇంటి సీలింగ్ ఫ్యాన్ కూడా తక్కువ మోడ్ లో ఆన్ చేసి పెట్టాలి. తద్వారా త్వరగా రూమ్ చల్లబడిపోతుంది.

Tags:    

Similar News