Cholesterol: మీ చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. కచ్చితంగా ఈ 5 శాఖాహారాలను తినాలి..
Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో శాఖాహార ఆహార పదార్దాలు చాలా బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా కరిగే ఫైబర్, మొక్కల స్టెరాల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి ఎక్కువగా ఉండే ఆహారపదార్దాలనే ఎంచుకోవాలి.
Cholesterol: మీ చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. కచ్చితంగా ఈ 5 శాఖాహారాలను తినాలి
Cholesterol: శరీరంలో పేరుకుపోయే కొవ్వులో మంచి, చెడు కొవ్వులు ఉంటాయి. అయితే మంచి కొవ్వుల వల్ల ఎలాంటి హానీ ఉండదు. కానీ చెడు కొవ్వుల వల్ల అన్నీ అనర్ధాలే. అయితే ఈ చెడుకొవ్వును మీ శరీరం నుంచి తొలగించుకోవాలని చూస్తే.. కచ్చితంగా ఈ ఐదు శాఖాహార ఆహారపదార్ధాలు తినాలి. అప్పుడే శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు వెంటనే తగ్గుతుంది.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో శాఖాహార ఆహార పదార్దాలు చాలా బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా కరిగే ఫైబర్, మొక్కల స్టెరాల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి ఎక్కువగా ఉండే ఆహారపదార్దాలనే ఎంచుకోవాలి. అవేంటో చూద్దాం.
ఫైబర్ ఫుడ్స్
ఓట్స్, బార్లీ, ఆపిల్స్, బేరిలు వంటి పండ్లు, బీన్స్, బంగాళ దుంపలు వంటి ఫైబర్ రిచ్ కూరగాయలు తీసుకుంటే శరీరానికి మంచి ఫైబర్ అందుతుంది. వీటిలో కరిగే ఫైబర్ గుణం ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు, జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. యాంటీ యాక్సిడెంట్లు కూడా ఫైబర్ ఉన్న ఆహార పదార్దాల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె దగ్గర పేరుకుపోయిన చెడు కొవ్వును తగ్గించడంలో దోహదపడతాయి.
ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్
సాల్మన్ చేపట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే హెల్దీ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. దీంతోపాటు గ్లిజరైడ్స్ స్థాయిలు కూడా తగ్గుతాయి.
బాదం
ప్రతి రోజూ బాదం తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ 5 శాతం తగ్గుతుందని హార్వర్డ్ యూనివర్శిటీ వెల్లడించింది. వీటి పాలను తీసుకోవడం వల్ల రక్తంలో మలినాలు కూడా తగ్గిపోతాయి. ప్రతిరోజూ రాత్రి బాదంపప్పుని నానబెట్టి ఉదయాన్నే తింటే కొలెస్ట్రాల్ కచ్చితంగా తగ్గుతుంది.
నారింజ
నారింజ, నిమ్మవంటి కాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అంతేకాదు వీటితో ఫైటో స్టెరాల్ కూడా ఉంటుంది. ఇది లిపోప్రోటీన్‌ని 7.5 నుండి 12 శాతం తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. కాబట్టి పులుపు ఉన్న ఆహారపదార్దాలు తినాలి.
పనీర్
పాలతో తయారైన పనీర్‌ని తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. వీటిని కూరలా వండి తినొచ్చు. లేదా చపాతీ పిండిలో కలిపి పరాఠాల్లా కూడా చేసుకుని తినొచ్చు.