Brain Tumor: రాత్రుళ్లు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? బ్రెయిన్ ట్యూమర్ కావొచ్చు
Brain Tumor: బ్రెయిన్ ట్యూమర్ అంటే మెదడులో ఉండే కణాలు నియంత్రణ లేకుండా పెరుగుతాయి. ఇవి కొన్ని సార్లు నెమ్మదిగా పెరుగుతూ సున్నితంగా ఉంటాయి. కానీ, కొన్ని ట్యూమర్లు వేగంగా పెరిగి ప్రాణాలకు ప్రమాదకరం అవుతాయి.
Brain Tumor: రాత్రుళ్లు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? బ్రెయిన్ ట్యూమర్ కావొచ్చు
Brain Tumor: బ్రెయిన్ ట్యూమర్ అంటే మెదడులో ఉండే కణాలు నియంత్రణ లేకుండా పెరుగుతాయి. ఇవి కొన్ని సార్లు నెమ్మదిగా పెరుగుతూ సున్నితంగా ఉంటాయి. కానీ, కొన్ని ట్యూమర్లు వేగంగా పెరిగి ప్రాణాలకు ప్రమాదకరం అవుతాయి.
జూన్ 8 ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం. ఈ సందర్భంగా బ్రెయిన్ ట్యూబర్ లక్షణాలు ఎలా ఉంటాయి.? ఈ వ్యాధిని మొదట ఎలా గుర్తించాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం లేవగానే తీవ్రమైన తలనొప్పి:
మీకు రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు లేదా ఉదయం మేల్కొన్న వెంటనే తలనొప్పి వస్తుంటే, ఇది సాధారణం కాదు. ముఖ్యంగా ఈ తలనొప్పి రోజుకోసారి కాకుండా నిరంతరం రావడం, దగ్గు, తుమ్ము వంటి చిన్న విషయాలతో తీవ్రత పెరగడం ఇవన్నీ మెదడులో ఒత్తిడికి సంకేతాలు. సాధారణ పైన్కిల్లర్లు తీసుకున్నా తగ్గకపోతే తప్పనిసరిగా వైద్య సలహా అవసరం.
నిద్రలో గణనీయమైన సమస్యలు:
ట్యూమర్ వల్ల మెదడులో నిద్ర నియంత్రించే భాగాలు దెబ్బతింటే, మీరు రాత్రిపూట నిద్రపడకపోవచ్చు. తరచూ మెలకువ రావడం, అసౌకర్యంగా అనిపించడం, లేదా పగటిపూట అలసటగా ఉండటం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇది నిర్దిష్ట కారణం లేకుండా జరుగుతుంటే, అలక్ష్యం చేయకండి.
రాత్రిపూట చెమటలు, అలసట
అనుకోకుండా రాత్రిపూట అధికంగా చెమట పట్టడం లేదా విశ్రాంతి లేకుండా అలసటగా అనిపించడం కూడా బ్రెయిన్ ట్యూమర్ లక్షణంగా మారవచ్చు. మెదడులో హార్మోన్ల సమతుల్యతను నియంత్రించే భాగం ప్రభావితమైతే ఈ లక్షణాలు వస్తాయి. ఇలా తరచూ జరుగుతుంటే, జాగ్రత్త అవసరం.
నిద్రలో మూర్ఛలు
మీరు నిద్రలో ఉన్నప్పుడు శరీరం ఆకస్మికంగా కంపించడం, మూర్ఛ పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే, ఇది తేలికగా తీసుకోరానిది. పెద్దలలో నిద్ర సమయంలో వచ్చే మూర్ఛలు ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్ సంకేతాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణం కనిపించిన వెంటనే న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి.
లేచిన వెంటనే వాంతులు
విశ్రాంతి తర్వాత లేచిన వెంటనే వాంతులు అవ్వడం, అది తరచూ జరుగడం. ఇది సాధారణ గ్యాస్ట్రిక్ సమస్య కాకపోవచ్చు. మెదడులో ఒత్తిడి పెరిగినప్పుడు, ఉబ్బిసలాట, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పితో పాటు వాంతులు వస్తే ఇది తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు.