శబరిమలలోకి వెళ్లిన మహిళపై అత్త దాడి

కేరళలోని శబరిమల ఆలయంలోకి ఇటీవల ప్రవేశించి చరిత్ర సృష్టించిన ఇద్దరు మహిళల్లో ఒకరైన కనకదుర్గపై దాడి జరిగింది. నిన్న ఇంటికి తిరిగి వస్తుండగా ఆమెపై ఈ దాడి జరిగింది.

Update: 2019-01-15 07:25 GMT
Kanakadurga

కేరళలోని శబరిమల ఆలయంలోకి ఇటీవల ప్రవేశించి చరిత్ర సృష్టించిన ఇద్దరు మహిళల్లో ఒకరైన కనకదుర్గపై దాడి జరిగింది. నిన్న ఇంటికి తిరిగి వస్తుండగా ఆమెపై ఈ దాడి జరిగింది. సొంత అత్తగారే కనకదుర్గ తలపై బలంగా మోదిందని, ప్రస్తుతం మల్లాపురం జిల్లాలోని ఓ ఆస్పత్రిలో కనకుదుర్గ చికిత్స పొందుతోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కనకదుర్గ ఆరోగ్య పరిస్థితి నిలికడగానే ఉందని చెబుతున్నారు.

గత జనవరి 2న శబరిమల ఆలయంలోకి 39 ఏళ్ల కనకదుర్గ, 40 ఏళ్ల బిందు అమ్మిని ప్రవేశించారు. దీంతో ఆలయం అపవిత్రమైందంటూ ఆలయం తలుపులు మూసేసిన పూజారులు సంప్రోక్షణ అనంతరం గుడి తలుపులు తెరిచారు. హిందూ సంప్రదాయాలను గౌరవించే తమ కుటుంబంలోని మహిళ ఆలయం ప్రవేశించిందంటే నమ్మలేకున్నానని, దీని వెనుక బలమైన కుట్రే ఉందని అప్పట్లో కనకదుర్గ సోదరుడు వ్యాఖ్యానించారు. తన సోదరిని భయపెట్టి ఆలయానికి తీసుకువెళ్లి ఉంటారని, ప్రస్తుతం ఆమె ఆచూకీ తెలియడం లేదని కూడా ఆయన అన్నారు. కనకదుర్గ ప్రాణాలకు ముప్పుకూడా ఉందన్నారు.

మరోవైపు కోజికోడ్‌లోని కనకదుర్గ ఇంటిముందు నిరసనలు కూడా జరిగాయి. దీంతో బిందు, కనకదుర్గ గత రెండు వారాలుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అక్కడ్నించే వారు తమకు బెదరింపులు వస్తున్నాయని, అధికారులు తమకు తగిన భద్రత కల్పించాలని కూడా కోరారు. ఈ నేపథ్యంలో ఇంటికి తిరిగివస్తుండగా కనకదుర్గపై సొంత అత్తే దాడి చేయడంతో ఆమె తలకు గాయమై ఆసుపత్రిపాలైంది.

Similar News