మధ్య తరగతి పన్ను చెల్లింపుదారులకు శుభవార్త

Update: 2019-02-01 07:25 GMT

ఎన్నికల వేళ మధ్యతరగతికి భారీ ఊరట ఇచ్చేలా ఆదాయపు పన్ను పరిమితిని రూ.5లక్షలకు కేంద్రం పెంచింది. వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపుపన్ను చెల్లించనవసరం లేదు. స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితి రూ. 40 వేల నుంచి రూ.50 వేలకు పెంచారు. పోస్టల్‌, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్‌ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీడీఎస్‌ పరిమితి రూ. 10 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్‌ గోయల్‌ బడ్జెట్‌లో ప్రకటించారు.

Similar News