India Post Recruitment 2024: పోస్టాఫీసులో డ్రైవర్‌, గ్రేడ్‌ 4 ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడంటే..?

India Post Recruitment 2024: భారతీయ తపాలా శాఖలో ఉద్యోగం పొందడానికి మంచి అవకాశం వచ్చింది.

Update: 2024-05-04 13:30 GMT

India Post Recruitment 2024: పోస్టాఫీసులో డ్రైవర్‌, గ్రేడ్‌ 4 ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడంటే..?

India Post Recruitment 2024: భారతీయ తపాలా శాఖలో ఉద్యోగం పొందడానికి మంచి అవకాశం వచ్చింది. ఇండియా పోస్ట్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ (జనరల్ గ్రేడ్) పోస్టులకు ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌ కింద ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగు తోంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆఫ్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపి వారు పేర్కొన్న చిరునామాకు పంపించాలి. ఈ రిక్రూట్‌మెంట్‌ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇండియా పోస్ట్ కింద భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మే 14లోగా అప్లై చేసుకోవాలి. ఈ తేదీ తర్వాత వచ్చిన అప్లికేషన్లు తిరస్కరిస్తారని గుర్తుంచుకోండి. ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనడానికి అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు అభ్యర్థి లైట్‌, హెవీ వెహికల్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి. వాహనాల్లోని చిన్న లోపాలను సరిచేసే పరిజ్ఞానం కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయోపరి మితి 27 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తుకు సంబంధించిన అర్హత, నిర్ణీత ప్రమాణాల గురించి అధికారిక నోటిఫికేషన్‌ను ఒక్కసారి చూడండి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు థియరీ టెస్ట్/డ్రైవింగ్ టెస్ట్, మోటార్ మెకానిజం టెస్ట్ ద్వారా వెళ్లాలి. ఈ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని గమనించాలి. ఆన్‌లైన్‌లో నింపిన దరఖాస్తు ఫారమ్ హార్డ్ కాపీని సంబంధిత పత్రాలతో పాటు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపవచ్చు. ఇతర మార్గాల ద్వారా వచ్చిన దరఖాస్తు ఫారమ్‌లు అంగీకరించరు. "మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు- 560001" అడ్రస్‌కు అప్లికేషన్‌లను పంపాలి.

Tags:    

Similar News