ఎస్సైకి ముద్దుపెట్టిన యువకుడు అరెస్ట్..
హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పోలీసు అధికారికి విచిత్ర అనుభవం ఎదురైంది. ఈనెల 28వ తేదిన బోనాల జాతర పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే సంబరాల జోరులో ఉన్న ఓ వ్యక్తి ఎస్సైకే ముద్డుపెట్టిన విషయం తెలిసిందే.
రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం
లింగ సమానత్వం, అసమానతలను రూపుమాపేందుకే ట్రిపుల్ తలాక్ బిల్లును రూపొందించినట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలియజేశారు. రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ... ఇటీవల కాలంలో సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
కేఫ్ కాఫీ డే ఓనర్ సిద్ధార్థ మిస్?
ప్రముఖ కేఫ్ కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ సోమవారం రాత్రి నుంచి కనిపించడం లేదని తెలుస్తోంది. ఈయన కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ అల్లుడు. మంగళూరు సమీపంలోని ఉల్లాల్ బ్రిడ్జి వద్దకు నిన్న రాత్రి ఆయన తన ఇన్నోవా కారులో వెళ్ళారు. బ్రిడ్జి పై సగం దూరం వెళ్ళాకా కారు ఆపుచేసి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లినట్టు తెలిసింది.
అసెంబ్లీ ముట్టడికి ఎమ్మార్పీఎస్ యత్నం.. పలువురు నేతల అరెస్ట్
ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా..ఇవాళ అసెంబ్లీ ముట్టడికి ఎమ్మార్పీఎస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో నేటి ఉదయం ఏపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్ నాయకులను ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకుంటున్నారు. తుళ్లూరులో పలువురు నేతలను అరెస్ట్ చేశారు.
థాయ్ ల్యాండ్ ఓపెన్ టోర్నీ నుంచి వైదొలిగిన సింధు..
భారత్ నెంబర్ వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ నుంచి చివరి నిమిషంలో వైదొలిగింది. ఇటీవల జరిగిన ఇండోనేషియా ఓపెన్ లో రెండో స్థానం లో నిలిచింది సింధు. తరువాత జరిగిన జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్ తోనే ఆగిపోయింది.