ఎస్సైకి ముద్దుపెట్టిన యువకుడు అరెస్ట్..

ఎస్సైకి ముద్దుపెట్టిన యువకుడు అరెస్ట్..
x
Highlights

హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పోలీసు అధికారికి విచిత్ర అనుభవం ఎదురైంది. ఈనెల 28వ తేదిన బోనాల జాతర పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి....

హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పోలీసు అధికారికి విచిత్ర అనుభవం ఎదురైంది. ఈనెల 28వ తేదిన బోనాల జాతర పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే సంబరాల జోరులో ఉన్న ఓ వ్యక్తి ఎస్సైకే ముద్డుపెట్టిన విషయం తెలిసిందే. దానికి ఆ పోలీసు అధికారికి వెంటనే స్పందిస్తూ సదరు వ్యక్తి చెంప పై చల్లుమనిపించాడు. అయితే సదురు వ్యక్తి ఫుల్లుగా తాగి ఉండటం వలనే అలా చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే డ్యూటీలో ఉన్న సదరు ఎస్ఐని ఆ యువకుడు అలా చేయ్యడంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ యువకుడి పేరు భానుగా గుర్తించారు. ఈ సంఘటన నల్లకుంట పరిధిలో చోటుచేసుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories