తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇటివల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని అక్రమగా అరెస్ట్ పిటిషన్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టు తుది తీర్పును ప్రకటించింది. ఈ మేరకు సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం కొట్టివేసింది. అసలు అరెస్ట్ అక్రమమనడానికి తగిన కారణాలు చూపలేదని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఎన్నికల ముందు రేవంత్ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ వేం నరేందర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచార సమయంలో డిసెంబర్ 4న కొడంగల్‌లో సీఎం కేసీఆర్ సభకు రానివ్వమని రేవంత్ సవాల్ విసరడంతో ముందుగానే రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తాని ఈరోజు కోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి గట్టి షాక్ అనే చెప్పవచ్చు.