Horoscope Today: చేపట్టిన పని సక్సెస్ అవ్వాల్సిందే.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. మీరున్నారేమో చెక్ చేసుకోండి..!

Horoscope Today: చేపట్టిన పని సక్సెస్ అవ్వాల్సిందే.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. మీరున్నారేమో చెక్ చేసుకోండి..!

Update: 2024-05-08 00:30 GMT

Horoscope Today: చేపట్టిన పని సక్సెస్ అవ్వాల్సిందే.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. మీరున్నారేమో చెక్ చేసుకోండి..!

(08-05-2024, బుధవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, చైత్ర మాసం, ఉత్తరాయణం, వసంతరుతువు, బహుళ పక్షం,

తిధి : అమావాస్య ఉదయం గం.8.51 ని.ల వరకు ఆ తర్వాత పాడ్యమి

నక్షత్రం: భరణి మధ్యాహ్నం గం.1.33 ని.ల వరకు ఆ తర్వాత కృత్తిక

అమృతఘడియలు: ఉదయం గం.9.09 ని.ల నుంచి గం.10.37 ని.ల వరకు

వర్జ్యం: అర్ధరాత్రి గం. 12.44 ని.ల నుంచి మే 9వ తేదీ తె.వా. గం. 2.14 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.11.47 ని.ల నుంచి మధ్యాహ్నం గం. 12.38 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం. 12.13 ని.ల నుంచి గం.1.49 ని.ల వకు

సూర్యోదయం : ఉదయం గం.5.47 ని.లకు

సూర్యాస్తమయం : సాయంత్రం గం.6.39 ని.లకు


మేషం : పనుల్లో శుభ ఫలితాలుంటాయి. నూతన ప్రయత్నాలకు అనువైన రోజు. ధనలాభం ఉంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. విందుల్లో పాల్గొంటారు. కుటుంబసౌఖ్యం ఉంటుంది. మిత్రులు తోడుగా ఉంటారు.


వృషభం : పనుల పూర్తికి బాగా శ్రమించాలి. సన్నిహితుల ప్రవర్తన మనసుకి కష్టం కలిగిస్తుంది. వేళకు భోజనం ఉండదు. కుటుంబ సభ్యుల వల్ల చికాకులుంటాయి. ధనం నిల్వ ఉండదు. ధైర్యంతో ముందుకు సాగండి.


మిథునం : ఆత్మవిశ్వాసంతో చేపట్టిన ప్రతి పనీ సఫలం అవుతుంది. ధనవృద్ధీ ఉంది. కీలక సందర్భంలో మిత్రులు తోడుగా ఉంటారు. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. సోదరవర్గం అండగా నిలుస్తుంది.


కర్కాటకం : మిత్రుల తోడ్పాటుతో అడ్డంకులను అధిగమిస్తారు. మనసు రకారకాలుగా భ్రమిస్తుంది. దుబారా ఖర్చులు, అవమానాలు గోచరిస్తున్నాయి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. అమ్మవారి పూజ శుభాన్నిస్తుంది.


సింహం : అనవసరంగా మీ తెలివితేటలను ప్రదర్శించకండి. పనులు సవ్యంగా సాగకపోవడం నిరాశను కలిగించినా, ఆత్మధైర్యాన్ని పెంచుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. వాత సంబంధ సమస్యలుంటాయి.


కన్య : రోజంతా జయప్రదంగా సాగుతుంది. ఇంటా బయటా సంబంధాలు మెరుగవుతాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. నూతన వస్తువులు కొంటారు. మీ శత్రువులు డీలా పడతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.


తుల : పనులన్నింటా విజయం లభిస్తుంది. డబ్బు సమస్య ఉండదు. నూతన వస్తువులు కొంటారు. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ వ్యవహారాలు సరిదిద్దుతారు. ప్రయాణాలు ఉపయుక్తంగా సాగుతాయి.


వృశ్చికం : కార్యసాధనకు శ్రమించాలి. ఆటంకాలను దాటేస్తారు. ఆశించిన ఆదాయం లభించదు. జీవితభాగస్వామి వైపు వారితో విభేదాలు గోచరిస్తున్నాయి. తగాదాలకు దూరంగా ఉండండి. జననేంద్రియ సమస్యలుంటాయి.


ధనుస్సు : మిశ్రమ ఫలితాలుంటాయి. స్వజనులే శత్రువులుగా వ్యవహరిస్తారు. దూర ప్రాంతానికి వెళ్లాల్సి రావచ్చు. అశాంతి ఏర్పడుతుంది. బలహీనతలు బయటపెట్టకండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.


మకరం : ఇష్టకార్యాలు నెరవేరతాయి. స్థిరనిర్ణయంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. పెద్దల ఆదరాభిమానాలు పొందుతారు. ఇంట్లోను మనసులోనూ శాంతి నెలకొంటుంది. కీర్తిప్రతిష్టలు వృద్ధి చెందుతాయి.


కుంభం : శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. అప్పులు తీర్చే ప్రయత్నాలు ఫలిస్తాయి. విందుల్లో పాల్గొంటారు. సంతానం పురోభివృద్ధి ఆనందాన్నిస్తుంది. ఆరోగ్యవృద్ధి ఉంది.


మీనం : జాగ్రత్తతో మెలగాలి. మిత్రుల తోడ్పాటుతో ఆపద నుంచి బయటపడతారు. అనవసర ప్రయాణాలు, దుబారా ఖర్చులు వద్దు. వేళకు భోజనం ఉండదు. ఇతరుల వృద్ధికి అసూయ చెందకండి. ఇష్ట దైవాన్ని పూజించండి.

Tags:    

Similar News