ఏటీఎంలోకి ప్రవేశించిన ఓ పాము కలకలం సృష్టించింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్లోగల థనేర్పండల్ రోడ్లో చోటుచేసుకుంది. థనీర్ర్పండల్ రోడ్లోని ఏడీబీఐ బ్యాంక్ ఏటీఎం మిషన్ నుంచి డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన ఓ కస్టమర్ పాము ఉండటాన్ని గమనించి వెంటన అలారాన్ని మోగించాడు. సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని బ్యాంక్ దృష్టికి తీసుకు వెళ్లగా పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. సదరు వ్యక్తి వచ్చి ఆ ఏటీఎంను తెరచి పామును పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH Tamil Nadu: A Snake found inside an ATM near Thaneerpandal Road in Coimbatore; later rescued by a snake catcher. ( 23.04.2019) pic.twitter.com/Yk6YSOIQVn
— ANI (@ANI) April 24, 2019