దంచికోడుతున్న ఎండలు .. బయటకు రావాలంటే భయపడుతున్న జనాలు ..

Update: 2019-05-29 02:30 GMT

ఏపీలో భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. పది గంటలు దాటితే చాలు రోడ్డుపైకి రావాలంటే ప్రజలు అల్లాడిపోతున్నారు. గత పది రోజుల నుంచి ఎండ తీవ్రత భారీగా ఉన్నా.. రోహిణి కార్తెతో ఏపీ నిప్పుల కుంపటిలా మారింది. మధ్యాహ్నం 12 అయితే, భానుడి దెబ్బకు.. రోడ్లన్నీ నిర్మనుష్కంగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలోని 16 ప్రాంతాల్లో మంగళవారం 45 నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 50 ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా మాచర్లలో అత్యధికంగా 46.09 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ప్రకాశం జిల్లా దర్శి, త్రిపురాంతకంలో 45.08 డిగ్రీలు.. కనిగిరిలో 45.65 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. వెలిగండ్లలో 45.59 డిగ్రీలు.. చిత్తూరు జిల్లా కొనకణమిట్లలో 45.22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. 

Similar News