నిందితుడు శ్రీనివాస్‌కు ప్రత్యేక బ్యారక్‌

Update: 2019-01-25 10:04 GMT

జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ కు వచ్చే నెల 8వరకు జ్యూడిషియల్ రిమాండ్ పొడిగించారు. రాజమండ్రి నుంచి విజయవాడ తరలించిన ఎన్ ఐఏ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా వచ్చే నెల 8 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. దీంతో నిందితుడు శ్రీనివాస్‌ను మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

వైసీపీ అధ్యక్షుడు జగన్ పై దాడి కేసులో విచారణ వాయిదా పడింది. ఈ కేసును వచ్చే నెల 8కి వాయిదా వేస్తున్నట్లు విజయవాడలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తెలిపారు. కస్టడీ ముగిసిపోవడంతో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు కోర్టుకు హాజరుపరిచారు.

గతేడాది అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై నిందితుడు శ్రీనివాసరావు కోడికత్తితో దాడిచేశాడు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఎన్ఐఏ విచారణ పూర్తి కావడంతో విజయవాడలో ప్రత్యేక కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాది సలీం వాదిస్తూ శ్రీనివాసరావుకు ప్రాణహాని ఉన్నందున రాజమండ్రి జైలులో ప్రత్యేక బ్యారక్ లో ఉంచాలని కోరారు. అలాగే జైలులో శ్రీనివాసరావుకు పెన్ను, పుస్తకం అందించాలని విన్నవించారు.

ఇందుకు అంగీకరించిన కోర్టు శ్రీనివాసరావును వచ్చే నెల 8వ వరకూ జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించాలని ఆదేశించింది. దీంతో నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు.

Similar News