మైనర్ బాలికతో కానిస్టేబుల్ అదృశ్యం

Update: 2019-02-02 07:43 GMT

విజయవాడ కానూరులో మైనర్ బాలికతో కానిస్టేబుల్ అదృశ్యమయ్యాడు. ప్రేమ పేరుతో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని కానిస్టేబుల్ బండి హరి ఇంటి నుండి తీసుకెళ్లాడు. బండి హరి పడమట పీఎస్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. వారం రోజుల నుంచి కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయి మైనర్ కావడంతో ఫోక్సో చట్టం కింద కానిస్టేబుల్ పై కేసు నమోదు చేశారు. 

Similar News