సుప్రీంలో మమత ప్రభుత్వానికి ఎదురు దెబ్బ

Update: 2019-02-05 05:50 GMT

సుప్రీంకోర్టులో మమతా బెనర్జి సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. శారదా స్కాంలో ఆధారాలు మార్చారంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సీబీఐ విచారణకు కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. విచారణకు హాజరుకాకుండా ఎందుకు నిరాకరిస్తున్నారని సుప్రీం ప్రశ్నించింది. సీబీఐ కోరినప్పుడల్లా మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని సీబీఐ శాఖ ఎదుట విచారణకు హాజరుకావాలని రాజీవ్‌కుమార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు గడచిన ఐదేళ్లలో ఎలాంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఎన్నికల ముందు అకస్మాత్తుగా సీబీఐ ఈ కేసు తెరపైకి తేవడాన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగా సీపీ రాజీవ్‌కుమార్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. 

Similar News