మరో మహా యాగానికి సిద్ధమైన కేసీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు యాగాలు, ముహుర్తాలు మీద బాగా నమ్మకం. ఇటివలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‍లో చండీహోమం నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ఇదే తరహా మరో మహా యగానికి కెసిఆర్ సిద్ధమయ్యారు.

Update: 2018-12-29 11:06 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు యాగాలు, ముహుర్తాలు మీద బాగా నమ్మకం. ఇటివలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‍లో చండీహోమం నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ఇదే తరహా మరో మహా యగానికి కెసిఆర్ సిద్ధమయ్యారు. మహారుద్ర సహిత సహస్ర చండీ యాగాన్ని కేసీఆర్ నిర్వహించనున్నాడు. వచ్చే ఏడాది జనవరి 21నుంచి 25 వరకు దాదాపు ఐదురోజుల పాటు ఈ యాగం సాగనుంది. ఏకోత్తర వృద్ధి సంప్రదాయంలో ఈ మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం జరగనుంది. తొలి రోజు 100 సప్తశతి చండీ పారాయణాలు, రెండోరోజు 200, మూడో రోజు 300, నాలుగో రోజు 400 పారాయణాలు నిర్వహిస్తారు. అన్నీ కలిపితే దాదాపు వేయ్యి పారాయణాలు అవుతాయి. ఇక ఐదవ రోజున 11 యజ్ఞ కుండలాలతో ఒక్కో కుండలం వద్ద 11మంది రుత్విక్కులతో 100పారాయణాలతో హోమం నిర్వహించనున్నారు. అనంతరం పూర్ణాహుతితో మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం ముగుస్తుంది. కాగా ఈ ఐదురోజుల్లో ప్రతి సాయంత్రం భాగవత, రామయణ పారయణం చేస్తారు.

Similar News