అలా చేస్తే చంద్రబాబుకి నాకు తేడా ఏంటి : జగన్

Update: 2019-06-13 07:04 GMT

నిన్న మొదలయిన ఏపి శాసనసభ సమావేశాలు ఈ రోజు కూడా కొనసాగాయి .. ఇందులో భాగంగా ఈ రోజు స్పీకర్ ఎన్నిక పూర్తి అయ్యింది . ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తమ్మినేని సీతారాంని ఆంధ్రప్రదేశ్ కి రెండో శాసనసభ స్పీకర్ గా ఎన్నికయ్యారు .. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఆయనకు అభినందనలు తెలిపారు. గత శాసనసభలో జరిగిన అన్యాయాలు తిరిగి జరగకుండా కొత్త స్పీకర్ సక్రమంగా సభను నిర్వహించాలని జగన్ కోరారు.

గత ప్రభుత్వంలో వైసీపీ నుండి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను అన్యాయంగా చేకుర్చుకున్నారని ఇంతటి అన్యాయానికి పాల్పడిన టీడీపీకి దేవుడు తగిన బుద్ధి చెప్పాడని ఎంతమంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకున్నారో అంతే మంది ఆ పార్టీకి మిగిలారని అయన అన్నారు. టీడీపీ చేసిన అన్యాయానికి దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది అంటూ జగన్ వాఖ్యానించారు ..

అంతేకాకుండా ఐదారుగురు టీడీపీ ఎమ్మెల్యేలను మనవైపు లాగేసుకుంటే ఇప్పుడు టీడీపీకి ఉన్నా ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని కొందరు నేతలు నాకు సలహా ఇచ్చారు. నేనూ అలాగే చేస్తే చంద్రబాబుకు, నాకు తేడా ఏముంటుంది. భవిష్యత్‌లో ఆ పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యే అయినా మా పార్టీలో చేరాలని వస్తే పదవికి రాజీనామా చేశాకే చేర్చుకుంటామని సభా సాక్షిగా చెబుతున్నానని ఒకవేళ ఆ సంప్రదాయం మేం పాటించకపోతే ఆ సభ్యుడిపై మీరే అనర్హత వేటు వేసేయండని అయన కోరారు . ఒక స్పీకర్ ఎలా ఉండకూడదో గత సభలో చూశాం. స్పీకర్ ఎలా ఉండాలో మా ప్రభుత్వం చేసి చూపిస్తుంది' అని జగన్ అన్నారు. 

Tags:    

Similar News