ప్రపంచ కప్ లో పాక్ పై ఓటమి ఎరుగని భారత్ .. ట్రాక్ రికార్డ్స్ ఇవే ..

Update: 2019-06-16 05:15 GMT

ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు ఇండియా - పాకిస్థాన్ జట్ల మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది .. దీనికోసం దేశం మొత్తం ఆసక్తిగా చూస్తుంది . అయితే ఇప్పటివరకు జరిగిన ప్రపంచ కప్ లో ఇండియా పాకిస్తాన్ పై ఓటమి చవి చూడలేదు .. 1992 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ విజేతగా నిలిచినా.. ఆ టోర్నీలో భారత్‌ని మాత్రం ఓడించలేకపోయింది. ప్రపంచకప్‌లో మొత్తం ఇరు జట్లు ఆరు సార్లు పోటి పడగా ఇందులో అన్ని సార్లు ఇండియాదే పై చేయి .. ఇందులో ఏకంగా ఐదుసార్లు ఛేదనకు దిగి ఓడిపోయింది. 2003 వరల్డ్‌కప్‌లో మాత్రం మొదట బ్యాటింగ్ చేయగా.. లక్ష్యాన్ని భారత్ ఊదేసింది. చివరిగా 2015 ప్రపంచకప్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 7 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన పాకిస్థాన్ 47 ఓవర్లలోనే 224 పరుగులకి కుప్పకూలిపోయింది...మరో సారి తాడో పేడో తేల్చుకునేందుకు ఇరు జట్లు ఈ రోజు మ్యాచ్ కి సిద్దం అయ్యాయి ..  

Tags:    

Similar News