ఉగ్రవాదులతో మా యుద్ధం కొనసాగుతుంది : సైన్యం

Update: 2019-02-28 14:21 GMT

ఉగ్రవాదులకు పాకిస్తాన్ మద్దతిచ్చినంత కాలం తాము కూడా ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేస్తూనే ఉంటామని మేజన్ జనరల్ సురేంద్ర సింగ్ మహల్ స్పష్టం చేశారు. భారతీయ సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ ఆర్మీ కాల్పులు జరుపుతోందని సురేంద్ర సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 26 ఉదయం నుంచి పాకిస్థాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని సురేంద్ర సింగ్ తెలిపారు. పాకిస్ఠాన్ ఏ రకంగా భారత్‌లోకి చొరబడటానికి ప్రయత్నించినా వారికి తగిన బుద్ధి చెప్తాము. మా యుద్దం ఉగ్రవాదులతో కొనసాగుతుంది' అని భారత త్రివిధ దళాలు పేర్కొన్నాయి. ఫైలట్ అభినందన్‌ రేపు సురక్షితంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నామని భారత త్రివిధ దళాలు తెలిపారు. జెనీవా ఒప్పందం ప్రకారమే అభినందన్‌ను తిరిగి భారత్‌కు పంపుతున్నారని భావిస్తున్నాము. త్రివిధ దళాలు ఒక్కటై దేశ భద్రతను కాపాడుతాయి.

Similar News