మూడో పెళ్లి కోసం ఇద్దరు భార్యలకు వేధింపులు

Update: 2019-01-14 11:54 GMT
Marriage

హైదరాబాద్ బోరబండలో దారుణం జరిగింది. మూడో పెళ్లి కోసం ఇద్దరు భార్యలను ఓ భర్త వేధించాడు. తాను మూడో పెళ్లి చేసుకుంటున్నానని ఇందుకు ఒప్పుకుంటున్నట్లు అంగీకార పత్రంపై సంతకాలు చేయాలని మొదటి, రెండో భార్యపై భర్త ఒత్తిడి తెచ్చాడు. సంతకం చేయనని చెప్పిన క్రమంలో రెండో భార్యను భర్త చితకబాదాడు. దీంతో ఇద్దరు భార్యలు కలిసి భర్తపై ఎస్ ఆర్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News