సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో మరో ముందడుగు పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించాయి.

Update: 2019-01-08 12:29 GMT

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో మరో ముందడుగు పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించాయి. ఇప్పటికే సీతారామ ప్రాజెక్టుకు అటవీశాఖ కూడా అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఇటీవల కేంద్రమంత్రి హర్షవర్ధన్ తో సీఎం కేసీఆర్ చర్చించారు. వచ్చే ఏడాది జూన్ వరకు ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ ప్రాజెక్టుతో కొత్తగూడెం, వైరా, పాలేరు నియోజకవర్గాల్లోని దాదాపు 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.  

Similar News