తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ శోభ!

తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ శోభ వెల్లివిరుస్తోంది. ఏపీ, తెలంగాణలో తెల్లవారు జాము నుంచే పండుగ సందడి మొదలైంది. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Update: 2020-10-25 01:59 GMT

తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ శోభ వెల్లివిరుస్తోంది. ఏపీ, తెలంగాణలో తెల్లవారు జాము నుంచే పండుగ సందడి మొదలైంది. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దుర్గా దేవి మండపాల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దుర్గ నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు కావడంతో మండపాల దగ్గర కోలాహలం కనిపిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా దసరా పండుగ సంబరాలను ఘనంగా చేసుకుంటున్నారు.

సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ పండుగను జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమైయ్యారు. ఉరకలు వేస్తున్న పండుగ ఉత్సాహంతో ప్రజల మనసంతా జోష్‌ నిండిపోయింది. ఇక దేశవ్యాప్తంగా వేర్వేరు ఆచారాల్ని పాటిస్తున్నా... అన్నింటి సందేశమూ ఒక్కటే... చెడుపై మంచి విజయం. ఈ చెడుపై మంచి గెలుపుకు ప్రతీకగా జరుపుకునే దసరాను ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండగ జరుపుకుంటున్నారు.

కరోనా వల్ల ఈ ఏడాది చాలా చోట్ల దసరా పండుగ కళ తప్పింది. ఉత్సవ వాతావరణం లోపించింది. మరోవైపు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు... రైతన్నకు వేదన మిగిల్చి పండుగ సంతోషాన్ని లేకుండా చేశాయి. నిండా మునిగిన భాగ్యనగరం ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటోంది. మొత్తానికి ఈసారికి ఉన్నచోటే సాదాసీదాగా కానిచ్చేద్దాం... అనే ఆలోచనలో జనం ఉన్నారు. 

Tags:    

Similar News