హార్దిక్‌పటేల్ చెంప చెల్లుమనిపించిన వ్యక్తి

Update: 2019-04-19 06:17 GMT

పాటీదార్ ఉద్యమనేత, గుజరాత్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపేయినర్ హార్దిక్‌పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్‌లోని సురేందర్‌నగర్‌లో హార్దిక్‌పటేల్ నేడు పర్యటిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హార్దిక్ పాల్గొని మాట్లాడుతుండగా ఓ వ్యక్తి స్టేజిపైకి వచ్చి హార్దిక పటేల్ చెంప చెల్లుమనిపించాడు. అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు సదరు వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. మూకదాడిలో గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హార్దిక్‌పై జరిగిన దాడిపై వెంటనే విచారణ జరిపించాల్సిందిగా ఫిర్యాదులో కోరారు.

Full View 

Similar News