ప్రేమోన్మాది భరత్‌ అరెస్టు

Update: 2019-02-06 11:33 GMT

ఇంటర్ విద్యార్థినిపై కత్తి దూసిన ప్రేమోన్మాది భరత్‌ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. కాచిగూడలో ప్రేమోన్మాదిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ప్రేమించడం లేదనే కారణంతో ఇవాళ ఉదయం బర్కత్‌పురాలోని సత్యానగర్‌లో ఇంటర్ విద్యార్ధినిపై భరత్ దాడికి దిగాడు. ప్రేమ పేరుతో కొద్దిరోజులుగా వేధిస్తున్న భరత్‌ కొబ్బరి బొండాల కత్తితో విచక్షణారహితంగా గాయపరాచాడు. ప్రస్తుతం బాధిత బాలిక పరిస్థితి విషమంగా ఉంది. 

Similar News