తాజ్ మహల్ దగ్గర మూడు గంటల కంటే ఎక్కువ సేపు ఉంటే జరిమానే..

Update: 2019-06-13 01:55 GMT

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ దగ్గర అధికారాలు చర్యలు కఠినతరం చేశారు. ఇక పై తాజ్ మహల్ ని చూడడానికి వచ్చిన సందర్శకులు వచ్చామా , కాసేపు ఉన్నామా పోయామా అన్నట్టుగా ఉండాలి అంతే .. ఇక పై తాజ్ మహల్ ని చూడడానికి వచ్చిన సందర్శకులు మూడు గంటలకు పైగా ఉంటే వారికి జరిమానా విధించాలని ఆగ్రా పురావస్తు శాఖ అధికారులు నిర్ణయించారు. తాజ్ వద్ద ఎక్కువ సమయం ఉంటే వారికి ఎగ్జిట్ గేటు వద్ద జరిమానా విధించాలని నిర్ణయించినట్లు ఆగ్రా పురావస్తు శాఖ సూపరింటెండెంట్ వసంత్ స్వరాంకర్ చెప్పారు. తాజ్‌మహల్ పరిరక్షణను పరిగణనలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కట్టడంగా గుర్తింపు పొందిన తాజ్ మహల్ సందర్శకులను నియంత్రించడానికి వీలుగా 14 గేట్లను ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News