నన్ను అరెస్ట్ చేయలేదు... విచారణకి మాత్రమే పిలిచారు : బండ్ల

Update: 2019-10-23 15:22 GMT

సినీ నిర్మాత బండ్ల గణేష్ ని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న వార్తలపై అయన స్పందించారు. నన్ను ఏ పోలీసులు అరెస్ట్ చేయలేదని ట్వీట్ చేసారు బండ్ల.. కేవలం విచారణ కోసం పిలవడం జరిగిందని, చట్టం పై గౌరవంతో వాళ్లు సహకరిస్తున్నానని, ఒకవేళ నన్ను అరెస్టు చేస్తే నేను మీకు తెలియజేస్తానని బండ్ల గణేష్ ట్వీట్టర్ లో పేర్కొన్నారు .. ఇది ఇలా ఉంటే.. ఈ రోజు సాయంత్రం ఆయనని అరెస్ట్ చేశారని ప్రచారం జరిగింది. ప్రముఖ నిర్మాత అయిన పీవీపీ తనని బండ్ల గణేష్ తరుపు మనుషులు వచ్చి బెదిరించారని ఆయన ఫిర్యాదులో పెర్కొనట్లు ఈ నేపధ్యంలో పోలీసులు ఆయనని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అలాంటిది ఏమి లేదని బండ్ల స్పష్టం చేసారు.  



Tags:    

Similar News