ఏపీ ఎన్నికల్లో ఓటేసేందుకు 10 లక్షల మంది వెళుతున్నారా?

Update: 2019-04-07 06:20 GMT

ఆంధ్రప్రదేశ్‌‌లో ఎన్నికల పొలింగ్ దగ్గరపడుటుండంతో ఆయా పార్టీలు హోరాహోరి ప్రచారం చేస్తున్నాయి. ఏపీలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆటకట్టుకునే యత్నాలు చేస్తున్నారు పార్టీ అధినేతలు. హామీల వర్షం కురిస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అగ్రనేతలు నేతలు ముందుకు సాగుతున్నారు. కాగా ఈ నెల 11 తేదిన జరుగుతున్నఎన్నికల సమరానికి తమ ఓటును వేసేందుకు హైదరాబాద్‌లో ఉంటున్న వారు పెద్ద ఎత్తున ఏపీకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి తాజాగా ఒక ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 9, 10 తేదీల్లో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు ఇప్పటికే బస్సులు, రైళ్లు బుకింగ్ లు ఫుల్ అయిపోయాయి. కాగా హైదరాబాద్ నుంచి 3వేల బస్సులు బయలుదేరనున్నట్లుగా చెబుతున్నారు.

ఏపీకి చెందిన వివిద ప్రాంతాలకు చెందిన పార్టీ అభ్యర్థులు వారు పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్లలకు గాలం వేసేందేకు హైదరాబాద్‌లో ఉండే ఓటర్లకు ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేయటం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆంధ్రా ఓటర్లు దాదాపు 10 లక్షల మంది వరకూ తమ ఓటు వేసేందుకు వెళుతున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి సంక్రాంతికి ఏ తీరులో అయితే తట్ట బట్టు సదురుకొని తమ సొంత ఉళ్లోకి వెళ్లారో ఇంచుమించు అదే స్థాయిలో తాజాగా ఓటేసేందుకు అంతే స్థాయిలో ఏపీకి వెళ్తుండటం గమనర్ధం. 

Similar News