China: మూడో సారి చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్

* చైనాకు శాశ్వత అధ్యక్షుడిగా ఉండేలా ప్లాన్ * బీజింగ్‌లో జరుగుతున్న ప్లీనరీ సమావేశాలు

Update: 2021-11-10 02:28 GMT

మూడో సారి చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్(ఫైల్ ఫోటో)

China: చైనా దేశానికి మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు జిన్ పింగ్ సిద్ధమవుతున్నారు. ఇందుకు అనుగుణంగానే అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా పావులు కదుపులోంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా తీర్మాణం చేసే అలోచనలో ఉంది.

తాజాగా చైనాలో 19వ సెంట్రల్ కమిటీ ఆరో ప్లీనరీ సోమవారం చైనా రాజధాని బీజింగ్‌లో ప్రారంభమైంది. ఇప్పటికే రెండు సార్లు అధ్యక్షుడిగా జిన్ పింగ్ అధికారం చేపట్టారు. ఇదిలా ఉంటే మూడో సారే కాకుండా శాశ్వతంగా అధ్యక్షుడిగా జిన్ పింగే ఉండేలా పావులు కదుపుతున్నారు. వచ్చే ఏడాది జిన్ పింగ్ పదవీకాలం ముగియనుంది.

2012లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమంగా ప్రాబల్యాన్ని పెంచుకొన్నారు జిన్ పింగ్. పార్టీలో, దేశంలోని కీలక అధికార పదవుల్లో తన వర్గీయులను నియమించుకోవడం ద్వారా స్వీయాధికారానికి ఎదురులేకుండా చేసుకున్నారు.

అంతకుముందు అధికారంలో ఉన్న హు జింటావో పార్టీలో ప్రజాస్వామిక ధోరణులు, సమష్టి నాయకత్వంపై దృష్టి కేంద్రీకరించగా అందుకు భిన్నంగా ఏకస్వామ్యం, ఏక వ్యక్తి పాలనవైపు జిన్‌పింగ్‌ మొగ్గుచూపడం గమనార్హం. ప్రస్తుతం బీజింగ్‌లో జరుగుతున్న పార్టీ ప్లీనరీలో కేంద్ర కమిటీకి చెందిన 370 మందికిపైగా ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలుస్తోంది. ఆధునిక చైనా చరిత్రలో ఇదో కీలకఘట్టమని చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే అసలు బీజింగ్‌ సమావేశం అజెండా బయటకు రాలేదు. సమావేశం తరవాత తీర్మానంలోని పలు అంశాలపై ఒక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ప్లీనరీ తీర్మానాలను వచ్చే ఏడాది జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశం ఎలాంటి చర్చలూ లేకుండా ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఈ సమావేశం అజెండాపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇరుగుపొరుగు దేశాలతో చైనా అనుసరిస్తున్న విధానం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ప్రత్యేకించి భారత్‌తో డోక్లాం, లద్దాఖ్‌ సరిహద్దుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.

దక్షిణ చైనా సముద్రంతో పాటు తైవాన్‌పై అనుసరిస్తున్న దుందుడుకు విధానాలతో భవిష్యత్తులో మరిన్ని ఘర్షణలు నెలకొనే అవకాశముంది. చైనాలో తిరుగులేని నేతగా ఆవిర్భవించిన జిన్‌పింగ్‌ ఇదే వైఖరిని పొరుగుదేశాలతో పాటు అంతర్జాతీయ యవనికపై ప్రదర్శిస్తే ఎన్నో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి

Tags:    

Similar News