ప్రపంచవ్యాప్తంగా 18 లక్షలుపైగా రికవరీలు

ప్రపంచంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తీవ్రత తగ్గుతుందని చెప్పాలి.

Update: 2020-05-17 04:48 GMT
Representational Image

ప్రపంచంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తీవ్రత తగ్గుతుందని చెప్పాలి. ఇప్పుడు రికవరీ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్ని దేశాలు లాక్ డౌన్ నుంచి సడలిస్తున్నాయి. తాజాగా 93979 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 47,15,388కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 31,23,17కి చేరింది. ప్రస్తుతం 18,09,805 మంది కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. 44840 మందికి వైరస్ తీవ్రంగా ఉంది.

అమెరికాలో కొంత సానుకూల కోణం కనిపిస్తోంది. మరణాలు 1033 మాత్రమే ఉన్నాయి. మొత్తంగా అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య 15,06,315కి చేరగా... మృతుల సంఖ్య 89,540కి చేరింది. బ్రెజిల్‌లో మాత్రం గురూస్ విజృంభిస్తోంది. అక్కడ శనివారం 14, 919 కొత్త కేసులు వచ్చాయి. అలాగే 816 మంది చనిపోయారు. బ్రెజిల్ తర్వాత రష్యా, బ్రిటన్, ఇండియా, మెక్సికో దేశాల్లో కరోనా ఎక్కువగా ఉంటోంది.

కరోనా పాజిటివ్ కేసుల్లో భారత్ , చైనాను వెనక్కు నెట్టింది. దీంతో ఇప్పటి వరకు ఇండియాలో మొత్తం 90,927 కేసులు నమోదు కాగా, 2,872 కరోనా మరణాలు సంభవించాయి. ఇక 53,946 యాక్టివ్ కేసులు ఉండగా, 34,108 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు.

Tags:    

Similar News