ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 47,17,038
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది.. రోజురోజుకూ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది.. రోజురోజుకూ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.చైనాలో మొదలైన ఈ మహమ్మారి వైరస్ 213 దేశాలకి పైగా విస్తరించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 47 లక్షల 17 వేల 38 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం వీటిలో 25 లక్షల 94 వేల 555 యాక్టివ్ కేసులు ఉండగా, 3 లక్షల 12 వేల 384 మంది మృతిచెందారు. వ్యాధి నుంచి కోలుకుని 18 లక్షల 10 వేల 99 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 15 లక్షలకి చేరింది. గడిచిన 24 గంటల్లో నమోదైన 20,965 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి అక్కడ కేసుల సంఖ్య 15,05,250 కి చేరింది. అటు మరణాల సంఖ్య 89,521 కి చేరింది. కాగా కరోనా నుంచి కోలుకుని 3,38,553 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక వివిధ దేశాల్లో అత్యధికంగా నమోదైన కోవిడ్-19 మరణాల వివరాలు ఇలా ఉన్నాయి.
స్పెయిన్-27,563, రష్యా-2,537, యూకే-34,466, బ్రెజిల్-15,633, ఇటలీ-31,763, ఫ్రాన్స్-27,625, జర్మనీ-8,027, టర్కీ-4,096, ఇరాన్-6,937, భారత్-2,871, పెరూ-2,523, చైనా-4,633, కెనడా-5,679, బెల్జియం-9,005, మెక్సికో-4,767, నెదర్లాండ్స్-5,670, ఈక్వెడార్-2,688, స్విర్జర్లాండ్-1,879, స్వీడన్-3,674, పోర్చుగల్-1,203, ఐర్లాండ్-1,533, ఇండోనేషియా-1,089, రోమేనియాలో 1,094 మంది చనిపోయారు.
ఇక భారత్ లో కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 90,648 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇందులో 2,871 మంది చనిపోగా, కరోనా నుంచి కోలుకుని నుంచి కోలుకుని 34,224 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 3,970 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వ్యాధి కారణంగా 103 మంది చనిపోయారు.
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలలో ఎక్కువగా ఉంది. ఇందులో మహారాష్ట్రలో కేసులు ఎంతమాత్రం తగ్గడం లేదు. అక్కడ గడిచిన 24 గంటల్లో 1,606 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 30,706కు చేరుకుంది. ఇక మహారాష్ట్ర తరవాత తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయు. గుజరాత్,తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 10 వేల మార్క్ ని దాటింది.