హెచ్ఐవీ లాగా కరోనా వైరస్ ఎప్పటికీ పోదు...WHO కీలక వ్యాఖ్యలు!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.

Update: 2020-05-14 03:24 GMT
Mike Ryan(File photo)

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.. హెచ్ఐవీ లాగా కరోనా వైరస్ ఎప్పటికీ పోదనీ, సమాజంలో మరో స్థానిక వైరస్ గా కరోనా మారవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ మైక్ ర్యాన్ వెల్లడించారు. హెచ్ఐవీ ప్రపంచం నుంచి ఎప్పుడు మాయమవుతుందో ఎవరికీ తెలియదని, దీనిలాగానే కరోనా వైరస్ కూడా అని ఆయన అన్నారు. అయితే ఈ వైరస్ కి ప్రస్తుతం శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ని ఇక పనిలో ఉన్నారని , ప్రస్తుతం ఈ జాగ్రత్తలతో కరోనా అరికట్టవచ్చునని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 44.27 లక్షలకు చేరుకోగా, భారత్ లో 75 వేలకి చేరుకుంది.  

Tags:    

Similar News