రాబోయే కాలంలో మరింత అప్రమత్తత అవసరం.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

రాబోయే కాలంలో కోవిడ్19 బారి నుంచి ప్రపంచ దేశాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హితవు పలికింది.

Update: 2020-05-12 05:19 GMT

రాబోయే కాలంలో కోవిడ్19 బారి నుంచి ప్రపంచ దేశాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హితవు పలికింది. రెండోసారి మహమ్మారి విజృంభణకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత అనేక దేశాలు ఆంక్షల్ని సడలిస్తున్న వేళ ప్రపంచ డబ్ల్యూహెచ్‌ఓ కీలక సూచన చేసింది.

లాక్‌డౌన్‌ ఆంక్షల్ని సడలిస్తున్న వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జర్మనీలో నిబంధనల్ని సడలించిన నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి వేగంగా పెరుగుతుందని గుర్తించారు. జర్మనీలో ఆంక్షలు మినహాయించి తర్వాతే వైరస్ వ్యాపించి ఉందని పేర్కొంది. వైరస్ కట్టడిలో దక్షిణ కొరియా ముందున్నప్పటికీ ఆంక్షలు సడలించిన తర్వాత నైట్ క్లబ్ ద్వారా వేగంగా వ్యాపించింది. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ దేశాల్ని అప్రమత్తం చేసేందుకు సిద్ధమైంది.

లాక్‌డౌన్‌ నుంచి మరింత అప్రమత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సంస్థ అత్యవసర విభాగం చీఫ్‌ మైకేల్‌‌ ర్యాన్‌ సూచించారు. చాలా మందిలో వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే యాంటీబాడీలు ఊహించిన దానికంటే తక్కువ స్థాయిలో ఉన్నాయని తేలిందన్నారు. అయినప్పటికీ వైరస్ ముప్పు పొంచి ఉందని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, లాక్ డౌన్ ఎత్తివేయడం సరైనదే కానీ, దశలవారీగా ఆంక్షలు సడలించడం చాలా ముఖ్యమని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ సూచించారు.


Tags:    

Similar News