Ghost Husband: దెయ్యపు భర్తతో విడాకులు కోరిన భార్య
Ghost Husband: సాధారణంగా.. మహిళలు ఎవరిని పెళ్లి చేసుకుంటారు?
Ghost Husband: దెయ్యపు భర్తతో విడాకులు కోరిన భార్య
Ghost Husband: సాధారణంగా.. మహిళలు ఎవరిని పెళ్లి చేసుకుంటారు? కుటుంబ సభ్యులు ఎంపిక చేసిన వరుడిని.. లేదా.. ప్రేమించినవాడిని మనువాడుతారు. మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని సామాజిక వర్గాల ఆచారాల నేపథ్యంలో జంతువులనో, చెట్లనో పెళ్లి చేసుకోవడం మనం వినే ఉంటాము.. కానీ.. అందుకు విరుద్ధంగా యునైటెడ్ కింగ్‌డమ్-యూకేకి చెందిన మహిళ పెళ్లి.. విడాకుల సమస్య తెరపైకి వచ్చింది. ఆమె వివాహం కథ వింటే విస్తుపోవడం మీ వంతు అవుతుందేమో... ఆమెది భయంకరమైన ప్రేమ కథ అనాలో.. లేక మనోహరమైన భయానక కథ అని చెప్పాలో... ఇప్పుడు బ్రిటన్‌లో ఆమె గురించి జోరుగా చర్చ జరుగుతోంది.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యూకేలోని ఆక్సఫర్డ్‌షైర్‌కు చెందిన 38 ఏళ్ల మహిళ పేరు రాకర్ బ్రకార్డ్.. ఆమె ఓ దెయ్యాన్ని పెళ్లి చేసుకున్నదట. మీరు విన్నది నిజమే.. ఇప్పుడు ఆ దెయ్యపు భర్త.. తన జీవితాన్ని నరకంగా మార్చాడట. అందుకే తనకు విడాకులు కావాలంటూ కోర్టుకెక్కింది. అసలు దెయ్యమేంటి? పెళ్లి ఏంటి? విడాకులు ఏంటి? అనే ప్రశ్నలు గందరగోళానికి గురిచేస్తాయి. 1830ల్లో బ్రిటన్‌ను విక్టోరియా మహారాణి పాలించింది. ఆమె కాలంలో సైన్యంలో పని చేసిన ఎడ్వర్డ్ దెయ్యంగా మారాడని.. అతడినే తాను పెళ్లి చేసుకున్నట్టు రాకర్ బ్రకార్డ్ చెబుతోంది. ఇది సరే.. అసలు ఆమె పెళ్లి ఎలా చేసుకుంది? అంటే.. ఓ ఫాదర్ ఆధ్వర్యంలోఏదో ఓ చర్చిలో పెళ్లి జరిగిందట. ఆ పెళ్లికి ఎడ్వర్డ్ హాజరయ్యారట. ఆ వీడియో ఫాదర్ పెళ్లికి సంబంధించిన తంతును పూర్తి చేస్తుండగా.. పెళ్లికూతురు డ్రస్‌లో బ్రకార్డ్ కనిపిస్తోంది. అంతేతప్ప.. అక్కడ మరెవరూ కనిపించరు. కానీ.. అక్కడ వరుడు ఉన్నట్టు భావించి.. ఫాదర్ వివాహాన్ని జరిపించారు.
భయానకంగా ఉన్న ఈ పెళ్లి విషయం ఎలా ఉన్నా.. ఇప్పుడు ఆమె భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది. ఇన్నాళ్లు లేనిది.. ఇప్పుడు ఎందుకు విడాకులు కోరుతోందంటే... తన భర్త.. తనను వెంటాడుతున్నాడట. తనను వేటాడుతున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిజానికి ఆమెకు కూడా దెయ్యాలంటే నమ్మకం లేదట. కానీ.. ఒకరోజు తన రూమ్‌లో ఎడ్వర్డ్ కనిపించే సరికి నమ్మాల్సి వచ్చిందట. తన దెయ్యపు భర్తను వదిలించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నట్టు బ్రకార్డ్ చెబుతోంది. తన జీవితం నరకంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన కల్పిత భర్తతో ఇక కలిసి జీవించలేనంటోంది. కేవలం ఐదు నెలల క్రితమే ఆమె ఆ దెయ్యాన్ని కలిసినట్టు చెబుతోంది. ఆమె కథను వింతగా పిలవడం తక్కువ అంచనానే అవుతుంది. కానీ... వాస్తవం ఏమిటంటే.. ఇలాంటి కథనాలు చాలా ప్రచారంలో ఉన్నాయి. రాకర్ బ్రకార్డ్ గురించి ప్రస్తుతం బ్రిటన్‌లో చర్చనీయాంశంగా మారింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోని వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.