Coronavirus: కరోనా వైరస్‌పై గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ

Update: 2020-01-31 07:50 GMT
కరోనా వైరస్‌పై గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ

ప్రాణాంతకంగా మారి తీవ్ర కలకలం సృష్టిస్తున్న కరోనా వైరస్‌ పట్ల డబ్ల్యూ హెచ్‌ ఓ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్‌ విస్తరిస్తున్న తీరు రోజురోజుకీ మృతుల సంఖ్య పెరుగుతుండటాన్ని దృష్టిలో ఉంచుకొని గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. దీంతో ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని సందేశాన్ని పంపింది. ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్న వ్యవస్థల్లో ఈ వైరస్ తీవ్రత భారీగా ఉండే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 213కు చేరింది. మరో 9వేల816 మందికి ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. ఒక్క చైనాలోనే 9వేల692 మందిని బాధితులుగా గుర్తించగా హాంగ్‌కాంగ్‌లో 12, మకావు 7, తైవాన్‌ 9, ఇతర ఆసియా దేశాల్లో 62, ఐరోపాలో 13, ఉత్తర అమెరికాలో 8, ఆస్ట్రేలియాలో 9, ఇతర ప్రాంతాల్లో 4 కేసులు నమోదైనట్లు ధృవీకరించారు. ఇక వైరస్‌కు కేంద్ర బిందువుగా ఉన్న హుబెయ్ ప్రావిన్సులో 204 మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 20 దేశాలకు కరోనా వైరస్ పాకినట్లు ధ్రువీకరించారు.

Tags:    

Similar News