పాస్‌వర్డ్ కారణంగా మూతపడ్డ 158 ఏళ్ల కంపెనీ.. రోడ్డున పడ్డ 700 మంది ఉద్యోగులు!
ఒకే ఒక్క వీక్ పాస్‌వర్డ్ కారణంగా 158 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కంపెనీ మూతపడింది. ఈ ఘటనతో 700 మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు.
పాస్‌వర్డ్ కారణంగా మూతపడ్డ 158 ఏళ్ల కంపెనీ.. రోడ్డున పడ్డ 700 మంది ఉద్యోగులు!
ఒకే ఒక్క వీక్ పాస్‌వర్డ్ కారణంగా 158 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కంపెనీ మూతపడింది. ఈ ఘటనతో 700 మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఒక ఉద్యోగి నిర్లక్ష్యంగా పెట్టిన బలహీనమైన పాస్‌వర్డ్ ద్వారా సైబర్ నేరగాళ్లు కంపెనీ సర్వర్లలోకి చొరబడి, సున్నితమైన డేటాను హ్యాక్ చేశారు. డబ్బు డిమాండ్ చేసినా, కంపెనీ చెల్లించలేకపోవడంతో ఆ డేటాను డిలీట్ చేయగా, సంస్థ చివరికి మూతపడాల్సి వచ్చింది.
బలహీనమైన పాస్‌వర్డ్ – భారీ నష్టం
సాధారణంగా ఫోన్, కంప్యూటర్ లేదా బ్యాంక్ అకౌంట్లకు పాస్‌వర్డ్‌ను బలంగా సెట్ చేయాలని సూచిస్తారు. కానీ సులభంగా ఊహించగలిగే పాస్‌వర్డ్ పెట్టడం వల్లే ఈ ఘోరం జరిగింది. ఒక చిన్న నిర్లక్ష్యం వందలాది మంది జీవితాలను అస్తవ్యస్తం చేసింది.
బ్రిటన్‌లో సైబర్ దాడి
ఈ సంఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. అక్కడి ప్రముఖ రవాణా సంస్థ కేఎన్‌పీ లాజిస్టిక్స్ (KNP Logistics) సైబర్ దాడికి గురై, కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ కంపెనీకి 158 ఏళ్ల చరిత్ర ఉండగా, దాని కింద సుమారు 500 లారీలు సర్వీసులు అందిస్తున్నాయి. Knights of Old బ్రాండ్ కింద ప్రధానంగా ఈ సంస్థ కార్యకలాపాలు సాగించేది.
సైబర్ దాడి కారణంగా ఒక్కసారిగా మూతపడిన ఈ కంపెనీతో 700 మంది ఉద్యోగులు నిరుద్యోగులయ్యారు. దీని వల్ల వారి కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.