Denver Airport Video: డెన్వర్ విమానాశ్రయంలో పెను ప్రమాదం... ల్యాండింగ్ గేర్‌ నుంచి మంటలు, పరుగులు తీసిన ప్రయాణికులు

Denver Airport Video: Denver Airport Video: అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం మధ్యాహ్నం ఓ భారీ ప్రమాదం తృటిలో తప్పింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ AA3023 బోయింగ్‌ 737 మాక్స్ విమానం టేకాఫ్ సమయంలో ల్యాండింగ్ గేర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

Update: 2025-07-27 03:43 GMT

Denver Airport Video

Denver Airport Video: అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం మధ్యాహ్నం ఓ భారీ ప్రమాదం తృటిలో తప్పింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ AA3023 బోయింగ్‌ 737 మాక్స్ విమానం టేకాఫ్ సమయంలో ల్యాండింగ్ గేర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విమానంలో ప్రయాణిస్తున్న 173 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

వెంటనే స్పందించిన సిబ్బంది అప్రమత్తంగా ప్రయాణికులను బస్సుల ద్వారా టెర్మినల్‌కు సురక్షితంగా తరలించారు. ప్రమాద సమయంలో విమానం మాయామి నుంచి రన్‌వే 34ఎల్ ద్వారా బయలుదేరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

టైర్లలో నుంచి మంటలు – రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది

అధికారుల వివరాల ప్రకారం, విమానం టైర్ల వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా ల్యాండింగ్ గేర్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక శాఖ రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. రన్‌వేపై విమానం మంటల్లో ఉండగా దట్టమైన పొగలు చెలరేగడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ప్రయాణికులంతా సురక్షితం – డెన్వర్ ఎయిర్‌పోర్టు తాత్కాలికంగా మూసివేత

ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోయినప్పటికీ, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొంత సమయం పాటు డెన్వర్ విమానాశ్రయం మూసివేయాల్సి వచ్చింది. పలు విమానాల షెడ్యూల్‌లపై ప్రభావం పడినట్టు సమాచారం.

విమాన ప్రమాదాల పరంపర – భయాందోళనలో ప్రయాణికులు

ఇటీవలే అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ఘటన, అలాగే రష్యా, బంగ్లాదేశ్ వంటి దేశాల్లోనూ సాంకేతిక లోపాలతో విమాన ప్రమాదాలు చోటుచేసుకోవడం యాదృచ్ఛికం కాదు. ఈ తరహా ఘటనలు విమాన ప్రయాణాలపై భద్రతా అంశాలను మరింతగా ప్రశ్నార్థకం చేస్తున్నాయి.



Tags:    

Similar News