అప్పటి వరకు ముప్పు తప్పదు.. అన్ని దేశాలకు W.H.O హెచ్చరిక

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 19,22,924కి చేరింది.

Update: 2020-04-14 03:01 GMT
World Health Organization

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 19,22,924కి చేరింది. వీరిలో 4,43861 మంది రికవరీ అయ్యారు. మరో 13,59,495 మంది కరోనాతో పోరాడుతున్నారు.వీరిలో 13,07,747 మందికి కరోనా చాలా తక్కువే ఉంది. కానీ 51748 వేల మందికి మాత్రం మృత్యువుతో పోరాడుతున్నారు.

కోవిడ్ మహమ్మారి ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని, వైరస్ ముప్పు నుంచి మానవాళి బయటపడే సూచనలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ఈ మహమ్మారి నుంచి ముప్పు తప్పదని స్పష్టం చేసింది. దేశాలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వైరస్ వ్యాప్తిని సరైన పద్దతులతో నియంత్రించాలని సూచించింది. డబ్ల్యూహెచ్‌వో అధికార ప్రతినిధి డా.డేవిడ్‌ నాబర్రో మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 2009లో వణికించిన స్వైన్‌ఫ్లూ కంటే ఈ వైరస్ ప్రపంచ దేశాలను పదిరెట్లు ప్రాణాంతకం అని హెచ్చరించింది.

ఇదిలా ఉండగా.. సోమవారం అమెరికాలో 25,793 కేసులు నమోదవ్వడంతో... మొత్తం కేసుల సంఖ్య 586093కి చేరింది. వీటిలో ఒక్క న్యూయార్క్‌లోనే 19,5655 కేసులున్నాయి. అమెరికాలో సోమవారం కొత్తగా 1487 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 23,592కి చేరింది. ఒక్క న్యూయార్క్‌లోనే వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇక్కడ దీని ధాటికి 10056 మంది మృతి చెందారు.


Tags:    

Similar News