అమెరికాలో కరోనా విధ్వంసం.. ఒక్క రోజులో 11 లక్షలకుపైగా కేసులు..

US Reports 11 Lakh Covid-19 Cases in a day: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది.

Update: 2022-01-11 14:28 GMT

అమెరికాలో కరోనా విధ్వంసం.. ఒక్క రోజులో 11 లక్షలకుపైగా కేసులు..

US Reports 11 Lakh Covid-19 Cases in a day: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. ఒక్కరోజులో 10 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఏ రోజుకు ఆ రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు వస్తుండడంతో అమెరికాలో ఆందోళన నెలకొంది. నిన్న ఒక్కరోజే అమెరికాలో 11 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జనవరి 3న 10 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పుడా రికార్డు బద్దలైంది. ప్రపంచంలో ఇప్పటివరకు ఒక్కరోజు ఇన్ని కేసులు మరే దేశంలోనూ నమోదు కాకపోవడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది.

మరోవైపు డేంజర్ వేరియంట్ ఒమిక్రాన్ సైతం ఆందోళన స్థాయిలో వ్యాపిస్తోంది. డెల్టా, ఒమిక్రాన్‌ల దెబ్బకు అమెరికాలో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఒకేరోజు 1.35 లక్షల మంది ఆసుపత్రిలో చేరినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇదిలా ఉంటే కరోనా తొలిదశలో వైరస్ మహమ్మారిని సమర్థంగా కట్టడి చేసిన ఆస్ట్రేలియా తాజాగా కొత్త కేసులతో విలవిలలాడుతుంది. ఆస్ట్రేలియాలో గడచిన వారం రోజుల వ్యవధిలో 5 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా పరిస్థితిపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్పందించారు. ప్రస్తుతం చేతిలో ఉన్నవి రెండే అవకాశాలు అని, లాక్ డౌన్ విధించడమో లేక కరోనా వ్యాప్తిని ఎక్కడికక్కడ కట్టడి చేసుకుంటూ ముందుకు పోవడమోనని తెలిపారు. అమితవేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్ ముప్పును దీటుగా ఎదుర్కోవాలని ప్రజలకు, వ్యవస్థలకు పిలుపునిచ్చారు.

మరోవైపు ఆస్ట్రేలియా ప్రధాని లాక్‌డౌన్ కామెంట్లపై ప్రజలు భగ్గుమన్నారు. ప్రధాని స్కార్ మారిసన్ ఇంటి దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకున్న నిరసనకారులు లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక్కసారిగా భారీగా జనం గుమిగూడడంతో అక్కడ ఆందోళన నెలకొంది. మహమ్మారి విజృంభిస్తున్న వేళ నిరసన కారులు ఒక్కరు కూడా కనీస కోవిడ్ నిబంధనలు పాటించలేదు. ఘటనపై అప్రమత్తం అయిన అధికారులు ఆందోళన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News